Abn logo
Sep 21 2021 @ 11:02AM

మానవ బాంబులతో దాడికి ఐఎస్‌ కుట్ర?

                  - రాష్ట్రమంతటా పోలీసుశాఖ అప్రమత్తం!


చెన్నై: రాష్ట్రంలో ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ మానవ బాంబులతో దాడి జరిపేందుకు కుట్రపన్నినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఉగ్రవాద సంస్థ ఇటీవల ఆత్మాహుతి దాడులు జరిపే తీరుపై ప్రత్యేకంగా ‘ఆత్మాహుతి దాడులు’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించి ఉద్యమకారులకు పంపిణీ చేసినట్టు కూడా ప్రకటించింది. గతంలో ఆ తీవ్రవాద సంస్థ ఆత్మాహతి దాడులకు సంబంఽ దించిన వివరాలను సామాజిక ప్రసార మాధ్యమాల్లో పెట్టేదని, ఆ విష యాలను సైబర్‌ క్రైం నిరోధక విభాగం అధికారులు సులువుగా పసిగడు తున్నారని తెలియడంతో ప్రస్తుతం పుస్తకాలను ముద్రించి సంస్థ సభ్యులకు పంచిపెట్టిందని ఇంటెలిజెన్స్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తున్న ఆ సంస్థ రాష్ట్రంలోనూ ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్‌  ఈ నెలారంభంలో హెచ్చరికలను జారీ చేసినట్టు సీనియర్‌ పోలీసు ఉన్నతా ధికారి ఒకరు తెలిపారు. దీంతో రాష్ట్రమంతటా అప్రమత్తంగా వుండాలని స్థానిక పోలీసు అధికారులకు సర్క్యులర్‌ పంపినట్లు పేర్కొన్నారు.