Jul 27 2021 @ 12:32PM

'ఇష్క్' ట్రైలర్ విడుదల

యంగ్ హీరో తేజ సజ్జా - ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన సినిమా 'ఇష్క్'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజు తెరకెక్కిచారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్ ఆర్‌బి చౌదరి నిర్మించారు. జూలై 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర బృందం, అందులో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను వదిలారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇటీవల 'జాంబి రెడ్డి' సినిమాతో వచ్చిన తేజ సజ్జా మంచి హిట్ అందుకున్నాడు. కానీ 'చెక్' సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన ప్రియా ప్రకాశ్‌కి మాత్రం హిట్ దక్కలేదు. దాంతో ఈ యంగ్ బ్యూటీ 'ఇష్క్' సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది.