Jul 31 2021 @ 20:12PM

ఇదే ఫ‌స్ట్ టైమ్‌.. చాలా సంతోషంగా ఉంది: తేజ సజ్జా

హీరో తేజ స‌జ్జా‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన‌ చిత్రం ‘ఇష్క్‌’. య‌స్‌.య‌స్‌. రాజు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రం జూలై 30న విడుదలై థియేటర్లలో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోన్న సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి మాట్లాడుతూ.. ‘‘ఇష్క్ సినిమా ఓ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ. ఈ పాండమిక్ ప‌రిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ.. మా సూప‌ర్ గుడ్ ఫిలింస్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌య్యాయి. అందువ‌ల్ల ఇష్క్ సినిమాను కూడా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని వెయిట్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. మా న‌మ్మ‌కం నిజ‌మైంది. ప్రేక్ష‌కులు సినిమాను చ‌క్క‌గా ఆద‌రించారు. మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. నిర్మాత‌లుగా మేం హ్యాపీ’’ అని తెలుపగా..‘‘కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో సినిమా విడుద‌ల‌వుతుంటే భ‌య‌ప‌డ్డాను. అస‌లు థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయో లేవోన‌నే సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు తెలుసో తెలియ‌దోన‌ని టెన్ష‌న్ ప‌డ్డాను. కానీ ప్రేక్ష‌కులు మా టెన్ష‌న్‌ను దూరం చేశారు. అన్ని షోస్‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భించింది. నా నటనకు మంచి అప్లాజ్ ద‌క్కింది. ఇంత‌కు ముందు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఇంత బ‌రువైన పాత్ర‌, హీరో క్యారెక్ట‌ర్ మీద‌నే సినిమా న‌డిచే పాత్ర చేయ‌లేదు. ఇదే ఫ‌స్ట్ టైమ్‌. చాలా సంతోషంగా ఉంది. ఇదొక ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. రొటీన్‌కు భిన్న‌మైన సినిమా అని ముందు నుంచి చెబుతున్నాం. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు‌’’ అని తెలిపారు హీరో తేజ.