Abn logo
Mar 5 2021 @ 14:00PM

`ఇష్క్`.. ప్రేమకథ కాదట!

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన తేజ సజ్జల ప్రస్తుతం హీరోగా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవలే `జాంబిరెడ్డి` వంటి వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ నటిస్తున్న తాజా చిత్రం `ఇష్క్`. ఇటీవల `చెక్`తో తెలుగు తెరంగేట్రం చేసిన వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎస్ఎస్ రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.


తాజాగా ఈ సినిమా పోస్టర్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు `ఇష్క్` అనే టైటిల్ పెట్టి.. `నాట్ ఏ లవ్‌స్టోరీ` అని క్యాప్షన్ పెట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక, ఈ పోస్టర్‌లో హీరో సీరియస్ లుక్‌లోనూ, హీరోయిన్ స్మైలీ ఫేస్‌తోనూ ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.   


Advertisement
Advertisement
Advertisement