వందో టెస్టులో తొలి సిక్స్ కొట్టిన ఇషాంత్

ABN , First Publish Date - 2021-02-25T23:20:57+05:30 IST

టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ తన వందో టెస్టులో ఓ విచిత్రమైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తన తొలి సిక్స్ కొట్టాడు. ఇంగ్లండ్-ఇండియా మధ్య పేటీఎం సిరీస్‌లో భాగంగా..

వందో టెస్టులో తొలి సిక్స్ కొట్టిన ఇషాంత్

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ తన వందో టెస్టులో ఓ విచిత్రమైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తన తొలి సిక్స్ కొట్టాడు. ఇంగ్లండ్-ఇండియా మధ్య పేటీఎం సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఇషాంత్ ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ మిడ్ ఆఫ్ మీదుగా సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ కొట్టడం కోసం ఇషాంత్ ఏకంగా 100 టెస్టులు వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ప్రస్తుతం తన వందో టెస్టు ఆడుతున్న 32ఏళ్ల ఇషాంత్.. టీమిండియా తరపున 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు.

Updated Date - 2021-02-25T23:20:57+05:30 IST