ఇషాన్‌ ఆటకు.. అదితి సంబరాలు

ABN , First Publish Date - 2020-10-25T08:59:57+05:30 IST

ముంబై ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌.. మోడల్‌, 2017 మిస్‌ ఇండియా ఫైనలిస్టు అదితి హుండయ్‌ మధ్య లవ్వాట సాగుతోందని

ఇషాన్‌ ఆటకు.. అదితి సంబరాలు

డేటింగ్‌ ఊహాగానాలకు బలం

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌.. మోడల్‌, 2017 మిస్‌ ఇండియా ఫైనలిస్టు అదితి హుండయ్‌ మధ్య లవ్వాట సాగుతోందని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా హుండయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు వారి మధ్య డేటింగ్‌ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. శుక్రవారం చెన్నైతో మ్యాచ్‌లో ఇషాన్‌ ధనాధన్‌ అర్ధ శతకంలో ముంబై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఇషాన్‌ హాఫ్‌ సెంచరీ వీడియోను అదితి పోస్టు చేసి సంబరాలు చేసుకొంది. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ నిజమేనని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

Updated Date - 2020-10-25T08:59:57+05:30 IST