ఐసెట్‌ మొదటి రోజు ప్రశాంతం

ABN , First Publish Date - 2020-10-01T09:36:20+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్‌ఐసెట్‌ మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర

ఐసెట్‌ మొదటి రోజు ప్రశాంతం

77 శాతం విద్యార్థుల హాజరు

కొవిడ్‌ నిబంధనలతో ఆన్‌లైన్‌లో పరీక్షలు


 కేయూ క్యాంపస్‌, సెప్టెంబరు 30: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్‌ఐసెట్‌ మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి కేయూక్యాంపస్‌లోని టీఎస్‌ఐసెట్‌ కార్యాలయంలో ‘బి’ సెట్‌ ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేసి పరీక్షలను ప్రారంభించారు. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్‌లో జరిగింది. గురువారం ఉదయం సెషన్‌తో ఐసెట్‌ ముగుస్తుంది.


కాగా బుధవారం ఏపీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 కేంద్రాల్లో రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. మొదటి సెషన్‌లో 18,701 మంది విద్యార్థులకు 14,438 మంది, రెండో సెషన్‌లో 2,0081 మందికి 15,850 మంది పరీక్షలకు హాజరయ్యారు. రెండుసెషన్లలో 8,494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు. వరంగల్‌ రీజియన్‌లో 89 శాతం విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల కేంద్రాల వద్ద విద్యార్థులకు థర్మల్‌స్కానింగ్‌ చేసి, ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసి లోనికి అనుమతించారు.  

Updated Date - 2020-10-01T09:36:20+05:30 IST