తెలంగాణ సొమ్ము ఏమైనా మీ తాత జాగీరా?

ABN , First Publish Date - 2022-05-23T09:37:20+05:30 IST

పంజాబ్‌ రైతులకు పంచడానికి తెలంగాణ సొమ్ము ఏమైనా మీ తాత జాగీరా? అని సీఎం కేసీఆర్‌ను వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల నిలదీశారు.

తెలంగాణ సొమ్ము ఏమైనా మీ తాత జాగీరా?

పంజాబ్‌ రైతులకు పంచడంపై కేసీఆర్‌ను నిలదీసిన షర్మిల

హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): పంజాబ్‌ రైతులకు పంచడానికి తెలంగాణ సొమ్ము ఏమైనా మీ తాత జాగీరా? అని సీఎం కేసీఆర్‌ను వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల నిలదీశారు. తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు రావా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ట్వీట్‌ చేశారు. పంట దిగుబడి లేక.. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశ కూడా సన్నగిల్లి సిద్దిపేట రైతు మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడని పేర్కొన్నారు. రూ.11 లక్షల అప్పుతెచ్చి పంచాయతీ పనులు చేయించిన నాగర్‌కర్నూలుకు చెందిన సర్పంచ్‌ ఎల్లయ్య బిల్లులు రాక చావడానికి ప్రయత్నించారన్నారు. దేశాన్ని ఏలాలనే దురదతో తెలంగాణ బిడ్డల్ని ముంచొద్దని కేసీఆర్‌కు సూచించారు. 

Updated Date - 2022-05-23T09:37:20+05:30 IST