ఈ పాలు మంచివేనా?

ABN , First Publish Date - 2021-08-05T05:30:00+05:30 IST

ఆవు, గేదె పాలల్లో ప్రొటీన్లు అధికం. కాల్షియం, పొటాషియంతో పాటు ఎ,బి,డి విటమిన్లు

ఈ పాలు మంచివేనా?

ఆవు, గేదె పాలల్లో ప్రొటీన్లు అధికం. కాల్షియం, పొటాషియంతో పాటు ఎ,బి,డి విటమిన్లు ఉంటాయి. డైరీమిల్క్‌ మాత్రమే కాకుండా నాన్‌డైరీ మిల్క్‌ అయిన కొబ్బరి పాలు, బాదం పాలు, సోయా పాలు, ఓట్‌మిల్క్‌లో ప్రొటీన్లూ, విటమిన్లు కూడా అధికమే. అయితే ఈ నాన్‌డైరీ మిల్క్‌ నిజంగా మంచిదేనా?


కొబ్బరి పాలు

పచ్చికొబ్బరి ఎంతో ఆరోగ్యకరం. కొబ్బరి వంటల్లో పడితే వచ్చే రుచే వేరు. పచ్చికొబ్బరి నుంచి వచ్చే కొబ్బరి పాలు తీయగా ఉంటాయి. ఆరోగ్యానికి శ్రేష్టమైన ఈ పాలల్లో కేలరీలు ఎక్కువ. ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల కొబ్బరి పాలకు బరువును తగ్గించే గుణముంది. ఇందులోని మాంగనీసు వల్ల బ్లడ్‌ప్రెషర్‌ కంట్రోల్‌ అవుతుంది. డైరీమిల్క్‌ కంటే వీటిలో కాల్షియం 50 శాతం అధికంగా ఉంటుంది. గుండెకూ మంచిదే. కొబ్బరిపాలల్లో సహజంగానే బాక్టీరియా, వైరస్‌ను అంతమొందించే లక్షణం ఉంటుంది. 


బాదం పాలు 

బాదం పాలు చాలా పాపులర్‌. శీతల పానియాలకంటే బాదంపాలే మంచిదనే వాళ్లున్నారు. ఒక కప్పు బాదం గింజల్లో కేలరీలు పుష్కలం. మినరల్స్‌తో పాటు మాంగనీసు, సెలెనియం, ఐరన్‌తో పాటు బి-విటమిన్‌ అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఎ- విటమిన్‌ ఎక్కువగా ఉండటం వల్ల కంటికి మంచిది. విటమిన్‌-ఇ వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అయితే తీపి ఉండే బాదం పాలను మరీ ఎక్కువ తాగినా మంచిది కాదు. 


సోయా పాలు 

బరువు తగ్గించే గుణం వీటికి ఉంది. ఎముకలకు మంచిది. బీపీని అదుపులో ఉంచుతుంది. ఇవి తాగిన వెంటనే శక్తి వస్తుంది. కొలెస్ర్టాల్‌ తక్కువగా ఉంటుంది. డైరీ మిల్క్‌ను ఇష్టపడని వీగన్స్‌ సోయా పాలను తాగుతారు. లాక్టోజ్‌ ఉండదు. దీంతో సులువుగా జీర్ణమవుతాయి. 


ఓట్స్‌ మిల్క్‌ 

సాధారణంగానే ఓట్స్‌ బరువు తగ్గడానికి తీసుకుంటారు. ఓట్స్‌ పాలు కూడా అంతే. ఇవి బరువును పెంచవు. విటమిన్లతో పాటు కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు. ఫైబర్‌ అధికం. ఆవు పాలతో పోలిస్తే ఇందులో పది శాతం ఎ-విటమిన్‌ అధికంగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో ఓట్స్‌ మిల్క్‌ను తీసుకోవచ్చు. 


Updated Date - 2021-08-05T05:30:00+05:30 IST