'సర్కారు వారి పాట' న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనా..?

'సర్కారు వారి పాట' సినిమా నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి మేకర్ రెడీ అవుతున్నట్టు లేటెస్ట్ న్యుస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట'కు పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీత దర్శకుడు. సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న 'సర్కారు వారి పాట' ఏప్రిల్ 1వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలో న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ మేకర్స్ తమ చిత్రాలకు సంబంధించిన పోస్టర్, టీజర్స్‌తో అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలో కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే మహేశ్ అభిమానులు కొత్త సంవత్సరం నుంచి  'సర్కారు వారి పాట' సంబరాలు మొదలుపెట్టేసారు.

Advertisement
Advertisement