Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాసంగికి నీరందేనా?

- పిచ్చిమొక్కలతో నిండిన దేగామ చెరువు కుడి, ఎడమ కాలువలు
- గండిపడి వృథాగా పోతున్న సాగునీరు
- నీళ్లుండీ.. పంటలకు అందని వైనం
- స్థానికంగా ఉండని అధికారులు
- ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

బజార్‌హత్నూర్‌, నవంబరు 28: మండలంలోని దేగామ గ్రామంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 393 ఎక రాల విస్తీర్ణంలో 4700 ఎకరాలకు సాగు నీరందించేందుకు చెరువును నిర్మించారు. ఈ చెరువు నిర్మాణం పూర్తయిన ప్రారంబంలో నిర్ణీత లక్ష్యంలోనే రైతులకు సాగు నీరందించారు. గత మూడేళ్లుగా చెరువుకు ఉన్న కుడి, ఎడమ కాలువలు పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోవడం తో కాలువలకు అక్కడక్కడ గండి పడి నీరంతా వృథాగ పోతోంది. 27 కిలొమీటర్ల పొడవున, 4200 ఎకరాలకు సాగునీరును ఎడమ కాలువ ద్వారా అందించే విధంగా, అలాగే ఐదు కిలోమీటర్ల పొడవున 500 ఎక రాలకు కుడి కాలువ ద్వారా సాగు నీరందించాల్సి ఉండగా కాలువలలో పూడిక, పిచ్చిమొక్కల వల్ల కనీసం 2,800 ఎకరాలకు కూడా సాగు నీరందడం లేదు. ప్రతీయేడు యాసంగి పంటల సమయంలో రైతులు సాగు నీరు వస్తుందని ఆశతో పంటలను సాగు చేసినప్పటికీ.. నీరందక పోవడంతో సరైనా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు.
కాలువల నిర్వహణ అస్తవ్యస్థం
మొత్తం 4,700 ఎకరాలకు సాగు నీరందించేందుకు నిర్మించిన దేగా మ చెరువు కాలువుల నిర్వ్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రస్తు తం సాగు నీరు కనీసం 2,800 ఎకరాలకు కూడా నీరందడం లేదు. కా లువల్లో పూడిక, పిచ్చిమొక్కలు పెరగడం వలన దిగువన ఆయకట్టుకు చుక్క నీరు కూడా అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు సమస్యలు విన్నవించుకుందామంటే వారు స్థానికంగా ఉండక పోవడంతో రైతులు వారిని కలిసేందుకు రోజుల తరబడి వేచిఉన్నా.. ఎపుడు వస్తారో? ఎపుడు వెళ్తారో? తెలియ అయో మయ పరిస్థితి నెలకొంది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మని రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో కొందరు రైతులు సొంత ఖర్చులతో అక్కడక్కడ కాలువకు మరమ్మతులు చేసుకుని పంటలకు నీరందించేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయకట్టు రైతులు వాపోతున్నా రు. గిర్నూర్‌ శివార భూములకు నీరందించే ఎడమ కాలువకు అక్కడ క్కడ గండి పడడంతో నీరంతా వృథాగా పోతోందని, తమ పంటలకు నీరందడం లేదని గిర్నూర్‌ శివారం రైతులు ఇటీవల స్థానిక రహదా రిపై ధర్నా చేశారు. సంబంధిత అధికారులు స్పందించక పోవడంతో రైతులు కాలువకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చుకున్నారు. ఇక నైనా సంబంధిత అధికారులు స్పందించాలని, ఈ యాసంగికి సాగు నీరు అందించేవిధంగా చూడాలని పలువురు రైతులు కోరారు.
పూడిక, పిచ్చిమొక్కలను తొలగించాలి
: మునేశ్వర్‌ సురేష్‌, రైతు, గిర్నూర్‌
చెరువు కాలువలలో పేరుకుపోయిన పూడికను, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి పంటలకు సాగు నీరందేవిధంగా చూడాలి. కాలువలకు ఏర్పడిన గండ్లను పూడ్చివేసి శాశ్వత పరిష్కారం చూపాలి.
నా పొలానికి సాగు నీరు అందడం లేదు
: భోజన్న, రైతు, బండ్రెవ్‌
 కుడి కాలువ పరిధిలో నాకు మూడు ఎకరాల పొలం ఉంది. ప్రతీ సంవత్సరం యాసంగి పంటగా శనగ సాగు చేస్తా. మా కాలువ చివరి వరకు సాగు నీరు రాకపోవడంతో పంట దిగుబడి తగ్గిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు నీరందించే విధంగా చూడాలి.
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం
: ప్రేమ్‌సింగ్‌, నీటిపారుదల శాఖ జేఈ
దేగామ ప్రాజెక్టు పరిధిలో ఉన్న చివరి ఆయకట్ట వరకు నీరందిస్తాం. కాలువలలో పూడికతీతకు ఈజీఎస్‌ ఆధ్వర్యంలో ఎస్టిమేషన్‌ వేసి పైఅధికారులకు నివేదికలు పంపాం. కాలువలకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చివేసి, సాగు నీరందించే విధంగా కృషి చేస్తాం.

Advertisement
Advertisement