రూల్స్‌ చెప్పడానికి బాలు విగ్రహమే దొరికిందా?: శిష్ట్లా

ABN , First Publish Date - 2022-10-05T08:22:30+05:30 IST

రూల్స్‌ చెప్పడానికి బాలు విగ్రహమే దొరికిందా?: శిష్ట్లా

రూల్స్‌ చెప్పడానికి బాలు విగ్రహమే దొరికిందా?: శిష్ట్లా

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘గుంటూరు నగరంలో అనధికారికంగా పెట్టిన విగ్రహాలు రెండు వందలకు పైగా ఉన్నాయి. వాటి వేటి జోలికి పోకుండా ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం విగ్రహం మాత్రం తొలగించడం ఏమిటి? రూల్సు చెప్పడానికి బాలు విగ్రహమే దొరికిందా’ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ గుంటూరు లక్ష్మీపురం సెంటర్లో మదర్‌ థెరిసా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహాన్ని  అధికారులు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఎస్పీ అభిమానులు చందాలు వేసుకొని ఈ విగ్రహం ఏర్పాటు చేశారని, ఆ గాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా?  అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పును దిద్దుకోవాలని ఆయన కోరారు.  


Updated Date - 2022-10-05T08:22:30+05:30 IST