Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రుల భాష సరైందేనా ?

సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలి

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

పులివెందుల టౌన, అక్టోబరు 22: మూర్ఖుడే రాజైతే ఎలా ఉంటుందో ప్రజలకు ఇప్పటికే అర్థమై ఉంటుందని, మంత్రులు మాట్లాడిన భాషపై ముఖ్యమంత్రి జగన్‌ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఏదో మాట్లాడారని దాడులకు దిగి, అరెస్టు చేసిన జగన మరి గత కొంతకాలంగా మంత్రులు మాట్లాడిన భాష ఏమిటో పరిశీలించాలన్నారు. మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి శుక్రవారం మాట్లాడుతూ ఒక్క మాట అన్నందుకు బీపీ పెరిగి దాడులు చేసేశారంటున్న జగన వైన షాపుల దగ్గర సీఎం గనను, ఆయన కుటుంబ సభ్యులను సైతం ప్రజలు బండబూతులు తిడుతున్న విషయం గుర్తించలేదా అన్నారు. ఇంటెలిజన్స వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటే ఎన్ని లక్షల మంది మీ కుటుంబాన్ని బూతులు తిడుతున్నారో అర్థమౌతుందన్నారు. ప్రస్తుతం బూతులకే పరిమితమైన ప్రజలు త్వరలో రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వస్తుందన్నారు. అది కూడా పులివెందుల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మూర్ఖుడు, మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారని, అలాంటి మూర్ఖుడే రాజైతే పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు అర్థమౌతోందన్నారు. గత రెండున్నరేళ్ల కాలంలో ద్వారంపూడి చంద్రశేఖర్‌, కృష్ణదాస్‌, అనిల్‌కుమార్‌యాదవ్‌, కొడాలి నాని మహిళలను సైతం కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వినపడలేదా అని నిలదీశారు. డీజీపీ వైసీపీకి మద్దతు పలకాలంటే కాఖీ చొక్క వదిలేసి వైఎస్సార్‌ కండువా కప్పుకోవాలన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే శిక్షించాలంటున్న డీజీపీకి రాజ్యాంగంపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. సీఎంకు ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో అలాంటి చట్టాలు ప్రతిపక్ష నేతకూ వర్తిస్తాయన్నారు. అలాంటపుడు చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో దూషిస్తే ఏమైపోయారని నిలదీశారు. డీజీపీపై సచ్ఛీలులైన ఐపీఎస్‌ అధికారులు సైతం తిరగబడే రోజు కూడా త్వరలోనే వస్తుందన్నారు. 


చంద్రబాబు దీక్షకు జిల్లా నేతల మద్దతు 

కడప, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ కార్యాలయం, పార్టీ నేతలపై జరిగిన దాడులను నిరసిస్తూ టీడీ పీ జాతీయ అధ్యక్షుడు మంగళగిరిలో చేపట్టిన 36 గంటల నిరశన దీక్షకు శుక్రవారం జిల్లా నుంచి పలువురు నేతలు వెళ్లి మద్దతు తెలిపారు. కడప పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గాజుల ఖాదర్‌బాషా, సాయినాథశర్మ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప అసెంబ్లీ ఇనచార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు, మైదుకూరు ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌, ప్రొద్దుటూరు ఇనచార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ముక్తియార్‌, రితీ్‌షకుమార్‌రెడ్డి, ఓబులాపురం రాజశేఖర్‌, పంతగాని నరసింహప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement