విరిగిన స్తంభాల గతి అంతేనా?

ABN , First Publish Date - 2020-09-20T06:49:47+05:30 IST

వైరాలోని జాతీయ ప్రధాన రహదారిలో డివైడర్లు నిర్మిస్తున్న అధికారులు వాహనాలు ఢీకొని విరిగిపోయిన సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలను పునర్నిర్మించటాన్ని విస్మరించారు...

విరిగిన స్తంభాల గతి అంతేనా?

వైరా సెంట్రల్‌ లైటింగ్‌ దుస్థితి

నిధుల కొరత అంటున్న అధికారులు


వైరా, సెప్టెంబరు 19: వైరాలోని జాతీయ ప్రధాన రహదారిలో డివైడర్లు నిర్మిస్తున్న అధికారులు వాహనాలు ఢీకొని విరిగిపోయిన సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలను పునర్నిర్మించటాన్ని విస్మరించారు. 2005 ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య, సర్పంచ్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ చొరవతో రూ.20లక్షలతో వైరాలో తల్లాడ రోడ్డులోని ఐఎంఎల్‌ డిపోనుంచి ఖమ్మం రోడ్డులోని శాంతినగర్‌ వరకు రెండుకిలోమీటర్లు సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మించారు. అయితే గడిచిన 15సంవత్సరాల కాలంలో ఈ జాతీయ రహదారిలో తిరిగే వాహనాలు ఢీకొని 20శాతానికిపైగా సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలు విరిగిపోయాయి. 2018లో వైరాలో డివైడర్ల ఆధునీకీకరణ మొదలైంది. ఇప్పటివరకు డివైడర్ల నిర్మాణం జరుగుతూనే ఉంది. రెండున్నర సంవత్సరాలు సెంట్రల్‌ లైటింగ్‌ వెలగలేదు. చివరికి వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ చొరవతో రెండు, మూడునెలల నుంచి సెంట్రల్‌ లైటింగ్‌ పనిచేస్తుంది. అయితే ఉన్న సెంట్రల్‌ లైటింగ్‌నే పునరుద్ధరించారు. అయితే విరిగిన స్తంభాల స్థానంలో కొత్త సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలను ఏర్పాటుచేయలేదు. అయినప్పటికీ డివైడర్లు మాత్రం యఽథావిధిగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు డివైడర్లు నిర్మించి తర్వాత సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలు ఏర్పాటుచేయాలని భావిస్తే మళ్ళీ డివైడర్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీ్‌సస్టేషన్‌ ముందు నుంచి క్రాస్‌రోడ్డు వరకు ఉన్న ఒకటిన్నరపర్లాంగుల దూరంలో కేవలం ఒక సెంట్రల్‌లైట్‌ స్తంభం మాత్రమే ఉంది. అలాగే పోలీ్‌సస్టేషన్‌ నుంచి ఐఎంఎల్‌ డిపో వరకు, క్రాస్‌రోడ్డు నుంచి శాంతినగర్‌ వరకు ఉన్న డివైడర్ల మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలు విరిగిపోయాయి. నిధుల కొరతతో కొత్త స్తంభాలు ఏర్పాటుచేయలేకపోతున్నామని మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది సమర్థించుకుంటున్నారు.

Updated Date - 2020-09-20T06:49:47+05:30 IST