ప్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం అంతేనా..?

ABN , First Publish Date - 2022-06-26T05:20:02+05:30 IST

ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం రైల్యే గేటుపై నిర్మిస్తున్న ప్లై ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం ముందుకు సాగడంలేదు.

ప్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం అంతేనా..?
రైల్వే పట్టాలపై మధ్యలో నిలిచిపోయిన ఆర్వోబీ పనులు

 ఏడాది క్రితం నిలిచిపోయిన ముగింపు పనులు  ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు

ములకలచెరువు, జూన్‌ 25: ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం రైల్యే గేటుపై నిర్మిస్తున్న ప్లై ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం ముందుకు సాగడంలేదు. దీంతో ఆర్వోబీ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ముగిం పు దశకు చేరుకున్న సమయంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పనులు నిలిచిపోయి ఏడాదికిపైగా కాస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.  ముంబా యి - చెన్నై జాతీయ రహదారిలోని ములకలచెరువు మండలం పెద్దపాళ్యం వద్దనున్న రైల్వేగేటు వల్ల రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో గేటు పడుతుండడంతో వా హనాలు బారులుతీరి నిలిచిపోయేవి. దీంతో జాతీయ రహదారిలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెద్దపాళ్యం రైల్వేగేటుపై ప్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేం ద్ర ప్రభుత్వం రూ.49కోట్లు విడుదల చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వాహనాలు రైల్యే గేటు నుంచి కాకుండా బ్రిడ్జిపై వెళ్తాయి. నిధులు విడుదల కావడంతో 2019 నవంబరులో పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర పాటు పనులు ముమ్మరంగా జరిగాయి. బ్రిడ్జి నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి దఽశకు వచ్చాయి. ఇరువైపులా రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. అయితే రైల్వేగేటుపై వెళ్తున్న బ్రిడ్జిపై కొంత భాగం దిమ్మెలు ఏర్పాటు చేసే పని నిలిచిపోయి ఏడాదిపైగా కావస్తున్నా అతీగతీ లేకుండా పోయింది. దీంతో బ్రిడ్జి నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొంత భాగం పనులు పూర్తి చేస్తే బ్రిడ్జి నిర్మాణం పను లు ముగియనున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.


రైల్వేశాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు

పెద్దపాళ్యం ఆర్వోబీ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపాం. రైల్వేశాఖ నుంచి పనులపై అనుమతులు వస్తూనే పూర్తి చేస్తాం. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. రెండు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చొరవ తీసుకున్నాం. రైల్వే గేటుపై వెళ్తున్న బ్రిడ్జిపై కొంత మేర దిమ్మెలు ఏర్పాటు చేస్తే పనులు పూర్తవుతాయి. 

- మధుసూధన్‌, ఏఈ, ఎన్‌హెచ్‌ శాఖ, మదనపల్లె 

Updated Date - 2022-06-26T05:20:02+05:30 IST