Apr 16 2021 @ 09:57AM

టాలీవుడ్‌కి తాప్సీ..?

ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్‌లో చాలా బిజీ హీరోయిన్‌గా వెలుగుతోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో వరసగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ప్రభాస్ నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాతో పాటు 'గుండెల్లో గోదార', 'సాహసం', 'ఘాజీ', 'ఆనందో బ్రహ్మ', 'నీవెవరో'. 'గేమ్ ఓవర్' సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత తాప్సీకి టాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశం దక్క లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం గొప్ప అవకాశాలు అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. హిందీలో తాప్సీ నటించిన సినిమాలు వరసగా సూపర్ హిట్ అవుతుండటంతో క్రేజీ స్టార్‌గా మారిపోయింది. 

కమర్షియల్ అండ్ గ్లామర్ రోల్స్ చేస్తూనే పింక్, బద్లా, నామ్ షభానా లాంటి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ బాగా గుర్తింపు సాధించింది. ఇక ప్రస్తుతం తాప్సీ చేతిలో 5 హిందీ సినిమాలునాయి. 'హసీన్ దిల్ రుబా', 'రశ్మీ రాకెట్', 'లూప్ లపేటా', 'దొబారా' సినిమాలు ఇప్పటికే షూటింగ్స్ పూర్తయి రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇక తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోన్న మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథూ' షూటింగ్ దశలో ఉంది. ఇంత బిజీగా ఉన్న తాప్సీ మళ్ళీ టాలీవుడ్ వైపు చూస్తోందట. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అయినా మెప్పించడానికి సిద్దంగా ఉందట. చూడాలి మరి తాప్సీకి మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయో లేదు.