Oct 28 2021 @ 09:30AM

సుజీత్ నెక్స్ట్ మూవీ ఆ బ్యానర్‌లోనేనా..?

యంగ్ డైరెక్టర్ సుజీత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన 'సాహో' మూవీతో పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరాడు. అయితే 'సాహో' తర్వాత మళ్ళీ సుజీత్ కొత్త ప్రాజెక్ట్ ఏదీ అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సుజీత్ నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే ఉండబోతోందని సమాచారం. 'సాహో' తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకుడిగా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ ఓ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి గానీ, ఏదీ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం అయితే యూవీ వారి సంస్థలో ఓ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తున్నాడట. సుజీత్‌ను 'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసింది, ఆ తర్వాత ప్రభాస్‌తో సుజీత్ డైరెక్షన్‌లో 'సాహో' నిర్మించింది ఈ బ్యానర్‌లోనే. కాగా ఇప్పుడు మూడవ సినిమా కూడా సుజీత్‌కు యూవీ వారే ఛాన్స్ ఇవ్వనున్నారట. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.