Apr 17 2021 @ 11:18AM

మళ్ళీ డిసప్పాయింట్..?

ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే న్యూస్ ఇది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, టీ సిరీస్ భూషన్ కుమార్ సమర్పిస్తుండగా.. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో నటిస్తున్న ఫస్ట్ పీరియాడికల్ సినిమా. అంతేకాదు దాదాపు 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరి. ఈ సినిమాలో మోస్ట్ వాటెండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 

అయితే రాధేశ్యామ్ జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అనుకున్న డేట్‌కి రాధేశ్యామ్ రిలీజాయ్యే అవకాశాలు కనిపించడం లేదని న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అందుకు కారణం ఇంకా కాస్త షూటింగ్ బ్యాలెన్స్ ఉండటమేనట. ప్రస్తుతం ఈ న్యూస్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారట. అంతేకాదు వీఎఫెక్స్ వర్క్ కూడా పూర్తవడానికి ఇంకా సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే టాలీవుడ్‌లో మీడియం బడ్జెట్ సినిమాలని వాయిదా వేస్తున్నారు. మరి రాధేశ్యామ్ జూలై 30న వస్తుందా అంటే.. అనుమానమే అని తెలుస్తోంది. చూడాలి.. ఏం జరుగుతుందో.