Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రో బయాటిక్స్‌ మంచివేనా?

ఆంధ్రజ్యోతి(26-09-2020)

ప్రశ్న: ప్రో బయాటిక్స్‌ అంటే ఏమిటి, వాటివల్ల లాభాలేమిటి?

- నిఖిల్‌, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: మన శరీరం పైన, లోపల కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. శరీరంలోని మంచి బ్యాక్టీరియా, కొన్ని రకాల ఈస్ట్‌లను ప్రో బయాటిక్స్‌ అంటారు. ప్రోబయాటిక్స్‌ను వివిధ రకాల ఆహారపదార్థాల నుండి కూడా పొందవచ్చు. మంచి బ్యాక్టీరియా రోగనిరోధక పనితీరును నియంత్రిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి, చెడు బ్యాక్టీరియాను అదుపు చేస్తాయి, కొన్ని రకాల విటమిన్లను తయారు చేస్తాయి, హానికారక సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించకుండా రక్షణనిస్తాయి. లాక్టోబాసిలస్‌, బైఫెడోబ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా, సక్కారోమైసెస్‌ బులార్డీ అనే ఈస్టులు ప్రోబయాటిక్‌ ఆహార పదార్థాలలో ఎక్కువ. ఇంట్లో తయారు చేసిన పెరుగు, మజ్జిగ, ఊరగాయ పచ్చళ్ళు, పులియబెట్టిన ఆహారపదార్థాలలో ఇవి ఉంటాయి. హెల్త్‌ఫుడ్స్‌ షాపుల్లో మీసో, కొంబుచ, కిమ్చి తదితర జాపనీస్‌, కొరియన్‌ ప్రోబయాటిక్‌ ఆహారం లభిస్తోంది. సప్లిమెంట్ల రూపంలోనూ దొరుకుతున్నాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)


Advertisement
Advertisement