రాజంపేటను జిల్లా చేయనందుకేనా ప్లీనరీ!

ABN , First Publish Date - 2022-06-29T05:17:57+05:30 IST

రాజంపేటను జిల్లా చేయనందుకు, అన్నమయ్య ప్రాజెక్టు తెంచేసినందుకే వైసీపీ నాయకులు రాజంపేటలో ప్లీనరీ సంబరాలు జరుపుకున్నారని, ఇటువం టి సమావేశాలు, సంబరాలు సిగ్గుచేటని రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు సోమలరాజు చంద్రశేఖర్‌ రాజు, టీడీపీ జిల్లా మహిళాధ్యక్షురాలు అనసూయమ్మ, పార్లమెంట్‌ అధికార ప్రతినిఽధి అద్దేపల్లె ప్రతాప్‌ రాజు, రాజంపేట టీడీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మ ణ్యంనాయుడు, టీడీపీ రాజంపేట మండల పార్టీ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మ ణ్యం నాయుడు, బీసీ నాయకుడు ఇడిమడకల కుమార్‌ విమర్శించారు

రాజంపేటను జిల్లా చేయనందుకేనా ప్లీనరీ!
మదనగోపాలపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు

రాజంపేట, జూన్‌ 28: రాజంపేటను జిల్లా చేయనందుకు, అన్నమయ్య ప్రాజెక్టు తెంచేసినందుకే వైసీపీ నాయకులు రాజంపేటలో ప్లీనరీ సంబరాలు జరుపుకున్నారని, ఇటువం టి సమావేశాలు, సంబరాలు సిగ్గుచేటని  రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు సోమలరాజు చంద్రశేఖర్‌ రాజు, టీడీపీ జిల్లా మహిళాధ్యక్షురాలు అనసూయమ్మ, పార్లమెంట్‌ అధికార ప్రతినిఽధి అద్దేపల్లె ప్రతాప్‌ రాజు, రాజంపేట టీడీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మ ణ్యంనాయుడు, టీడీపీ రాజంపేట మండల పార్టీ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మ ణ్యం నాయుడు, బీసీ నాయకుడు ఇడిమడకల కుమార్‌ విమర్శించారు. మంగళవారం మదనగోపాలపురం పంచా యతీలో బాదుడే బాదుడు కార్యక్రమంలో వారు మాట్లాడు తూ రాజంపేటను జిల్లా చేస్తామని చెప్పి మోసం చేసిన వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకొని సంబరాలు చేసుకు న్నారని ప్రశ్నించారు. వారి నిర్వాకంతోనే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందన్న విషయం ప్రజలకు తెలియందా అని ప్రశ్నించారు.  వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం తఽథ్యమన్నారు.  రాజంపేట పట్ట ణ టీడీపీ మాజీ అధ్యక్షుడు సంజీవరావు, మండల మాజీ  అధ్యక్షుడు బాసినేని వెంకటేశ్వర్ల నాయుడు, మాజీ కౌన్సిలర్‌ గుగ్గిళ్ల చంద్రమౌళి, రాజంపేట మండల మహిళా కార్యదర్శి మిరియాల జ్యోతి, రామ్‌నగర్‌ నరసింహ, చెంగయ్య నాయుడు, బాలాజీ పాల్గొన్నారు.

ఓబులవారిపల్లె : వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీని ప్రజలకు చేరువయ్యేలా  చేస్తున్నామని ్ట రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు తెలిపారు.  మంగంపేటలో అనుమలగుండం చంద్రమోహన్‌ ఇంట్లో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రాజు అధ్యక్ష తన కార్యకర్తలు, నేతలు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేత విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా,  టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాఽథనాయుడు ఆధ్వ ర్యంలో మంగంపేటలో  గ్రామ పంచాయతీ కార్యాల యం, మినరల్‌ వాటర్‌ప్లాంట్‌లు, సిమెంట్‌ రోడ్లు, హాస్పిటల్‌ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అనుమల గుం డం చంద్రమోహన్‌ మాట్లాడుతూ గత వైభవం రావా లంటే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని పిలుపు నిచ్చారు. అనంతరం టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాఽథ నాయుడు మాట్లాడుతూ గునిపాటి రామయ్య పార్లమెంట్‌ సభ్యుడుగా ఉన్నప్పుడు టీడీపీని వందశాతం  ఓట్లు వేసి గెలిపించింది  మంగంపేట వారేనని, ఆ వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని కోరుతున్నానన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. మండల నాయకులు చప్పిడి రమేష్‌బాబు, బీసీ నాయకులు కమతం నాగరాజు, అనుమలగుండం చంద్రమోమన్‌, మహిళా నాయకురాలు అనిత దీప్తి, జయచంద్ర, మంగంపేట గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి

రాయచోటిటౌన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొ చ్చినా వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజ లు సిద్దంగా ఉన్నారని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం  రాయచోటి మున్సిపాలిటీలోని 4,5 వార్డుల్లో ఆయన పర్య టించి వైసీపీ  అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ఇంటిం టికి వెళ్లి వివరించారు. వైసీపీఅధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేద న్నారు. మురుగు కాలువలు పొంగి పొర్లుతుండడంతోపాటు, వ్యాధులు ప్రబలుతున్నా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి పట్టించుకో వడం లేదని ఆరోపించారు.కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక, జగన్‌పాలనలో పేదవాడి బతుకు భారమై, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిం దన్నారు. రూ. 1500 చేసే ట్రాక్టర్‌ ఇసుకను పదివేలకు విక్ర యిస్తూ  వైసీపీ నాయకులు సొమ్ము చేసుకుంటు న్నారని విమర్శించారు.  నాసిరకమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్‌వలి, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి వతన్‌నిస్సార్‌, వక్ష్‌బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు అమీర్‌జాన్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి, అతావుల్లా, ఇనామ్‌, జాబీర్‌, సాయి, మస్తాన్‌, మహబూబ్‌బాషా, న్యామత్‌, రెడ్డెయ్య, గన్‌మెన్‌ రాజు, బడుగు వాసుదేవ, శంకర్‌రెడ్డి, మహమ్మద్‌, జిలాన్‌బాషా, జావీద్‌, సయ్యద్‌ ముబారక్‌, మేదర శ్రీను, గొర్లముదివేడు మాజీ సర్పంచ్‌ జిలానీబాషా  పాల్గొన్నారు. 

లక్కిరెడ్డిపల్లె: ప్రజలకు ఏ పథకాలు అందకపోయినా అన్ని పథకాలు అందాయని అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి  పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా  ఎగువ బత్తనపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభు త్వ అరాచకాలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు బడుగు వాసుదేవుడు, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవనాథరెడ్డి, రామాంజుల్‌రెడ్డి పాల్గొన్నారు.

గాలివీడు: పెద్దపల్లెకు చెందిన బుసిరెడ్డి రామచంద్రారెడ్డి మరణం బాధాకరమని  మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లెలో ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.  

ఒంటిమిట: కొండమాచుపల్లెలో బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన ధరలు, చార్జీలను వివ రించడంతోపాటు, పట్టు, జరీ వంటి చేనేత ముడి సరుకు లపై పన్నులు విధిస్తూ చేనేత కార్మికులను వైసీపీ ప్రభుత్వం అణగదొక్కుతోందని విమర్శించారు. రామచంద్ర, బొబ్బిలి రాయుడు, పుత్తా యానాదయ్య, సామా శ్రీనివా సులు, నామాల వెంకటయ్య, వీరాంజనేయరెడ్డి, వీరబ్రహ్మం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:17:57+05:30 IST