‘ఫోన్‌ పే’ సేఫేనా?

ABN , First Publish Date - 2020-07-11T06:31:17+05:30 IST

‘ఫోన్‌ పే’ సేఫేనా?

‘ఫోన్‌ పే’ సేఫేనా?

ఫోన్‌ పే, గూగుల్‌ పే లాంటి యుపిఐ యాప్స్‌ వాడటం సురక్షితమేనా? హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంటుందా? - ప్రదీప్‌



యుపిఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఆధారంగా పనిచేసే ప్రతి అప్లికేషన్‌ డివైజ్‌ మ్యాక్‌ ఐడి, ఫోన్‌ నెంబర్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ని బైండ్‌ చేస్తుంది. చాలా వరకు ఇలాంటి వాటిని వాడడం సురక్షితమే. అయితే కొన్ని ప్రత్యేకమైన ప్రమాదకరమైన లింకులను 

పంపించడం ద్వారా సోషల్‌ ఇంజనీరింగ్‌ టెక్నిక్‌లను ఆసరాగా చేసుకుని  కొన్ని అప్లికేషన్ల ద్వారా చాలా సులభంగా మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ చేయొచ్చు.  కాబట్టి యాప్‌ వాడడం వరకూ ఎలాంటి రిస్క్‌ ఉండదు కానీ, బయట నుండి వచ్చే లింకులను క్లిక్‌ చేసినప్పుడు మాత్రమే ప్రమాదం ఉంటుంది. వీటి పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-07-11T06:31:17+05:30 IST