Apr 11 2021 @ 15:37PM

నవీన్ పోలిశెట్టి స్టార్ హీరో లిస్ట్‌లో చేరినట్టేనా..!

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. హీరో..హీరోయిన్..దర్శకుడు..సంగీత దర్శకుడు..సహా ఇతర విభాగాలకి చెందిన వాళ్లు ఎంతో ఆశతో వచ్చి సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలని కృషి చేస్తుంటారు. కానీ అదృష్టం కొందరికి మాత్రమే దక్కుతుంది. నట వారసులు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కొత్త వాళ్ళు వచ్చి హీరోగా సెటిలవడం అంటే అంత సులభమైన విషయం కాదు. కానీ టాలెంట్ ఉంటే మాత్రం మెగాస్టార్ మాదిగా ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు చేరుకోవచ్చు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నట వారులే కాదు.. బయట వారూ హీరోలవుతున్నారు. అలా స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను కొత్తగా మలచుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో బాగా పేరు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఇటీవల వచ్చిన జాతిరత్నం సినిమాతో స్టార్ అయ్యాడు. జాతిరత్నాలు సినిమా నవీన్ పొలిశెట్టికి దేశ విదేశాలలో బాగా క్రేజ్‌ని తీసుకు వచ్చింది. ఈ సినిమా సక్సస్‌తో టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ అందుకోవడంతో పాటు భారీగా రెమ్యూనరేషన్ కుడా అందుకుంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం రెండు పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయబోతున్నాడట నవీన్ పొలిశెట్టి. అంతేకాదు ప్రస్తుతం తనకున్న క్రేజ్‌ని దృష్ఠిలో పెట్టుకొని 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట. దాంతో టాలీవుడ్ యంగ్ హీరోల లిస్ట్‌లో నవీన్ పొలిశెట్టి చేరాడని చెప్పుకుంటున్నారు.