Jun 22 2021 @ 08:06AM

ఓటీటీలో 'మాస్ట్రో'..?

యూత్‌స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మాస్టో' ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 'అంధాదున్‌'కి అఫీషియల్ రీమేక్‌గా 'మాస్ట్రో' సినిమాను యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్‌గా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ క్రమంలో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తుండగా, ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నేరుగా డిజిటల్ రిలీజ్ చేయనున్నారట. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది.