May 8 2021 @ 14:37PM

మహేష్ ఫస్ట్ లుక్ రెడీ అవుతుందా..?

సూపర్‌స్టార్ మహే బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చేందుకు టీమ్ రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ నెల 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.