నవ్వుతో ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-02-11T21:24:21+05:30 IST

న‌వ్వడం వలర ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు ఇటీవల చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. రోజూ 100 సార్లు గ‌న‌క న‌వ్వితే 15 నిమిషాల పాటు సైకిల్ తొక్క‌డానికి స‌మాన‌మ‌ట‌. అలాగే 10 నిమిషాలు రోయింగ్ మెషీన్‌పై వ్యాయామం

నవ్వుతో ఆరోగ్యం

న‌వ్వడం వలర ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు ఇటీవల చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. రోజూ 100 సార్లు గ‌న‌క న‌వ్వితే 15 నిమిషాల పాటు సైకిల్ తొక్క‌డానికి స‌మాన‌మ‌ట‌. అలాగే 10 నిమిషాలు రోయింగ్ మెషీన్‌పై వ్యాయామం చేసిన దాంతో స‌మాన‌మ‌ట‌. అలాగే అది 30 నిమిషాల పాటు వాకింగ్ చేసిన దానికి, 15 నిమిషాల పాటు రన్నింగ్ చేసే దానికి స‌మాన‌మ‌ట‌. దాంతో దాదాపుగా 100 నుంచి 150 క్యాల‌రీల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతాయంటున్నారు పరిశోధకులు. అలా నిత్యం 100 సార్లు గ‌న‌క న‌వ్వగలితే వ్యాయామం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.  న‌వ్వ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి బాగా వ్యాయామం అవుతుంద‌ని, దాంతో అధిక బ‌రువు, డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. 

Updated Date - 2020-02-11T21:24:21+05:30 IST