Aug 30 2021 @ 07:58AM

'మిమి' తెలుగు - తమిళ రీమేక్‌లో కీర్తి సురేష్ ..?

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ హిట్ మూవీ 'మిమి' తెలుగు - తమిళ రీమేక్‌లో నటించబోతుందనే వార్త తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం కీర్తి నటించిన 'మరక్కార్', 'గుడ్ లక్ సఖి', 'అణ్ణాత్త’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తమిళ చిత్రాలు 'సాని కాయిదం', 'వాశి' అలాగే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారువారి పాట', మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో మరో సినిమా చేసేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం.

ఇటీవల హిందీలో తెరకెక్కిన 'మిమి' ఓటీటీలో విడుదలై మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు దీని తెలుగు, తమిళ రీమేక్‌లో కీర్తి సురేష్ నటించటానికి ఒకే చెప్పిందట. ఇటీవల ఆమెని మెకర్స్ సంప్రదించగా కథ నచ్చి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే గత ఏడాది కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' తీవ్రంగా నిరాశపరిచాయి. మరి ఈ ఓరియెంటెడ్ సినిమాకి నిజంగా కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆసక్తికరమైన విషయమే.