నిరాహార దీక్షకు కేసీఆర్ సిద్ధమేనా: రేవంత్

ABN , First Publish Date - 2021-03-05T21:48:35+05:30 IST

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సి

నిరాహార దీక్షకు కేసీఆర్ సిద్ధమేనా: రేవంత్

హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సిద్ధమేనా అని సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో  రాష్ట్ర పునర్విభజన చట్టంలో అమలుకాని అంశాలపై ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సిద్ధమా అని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.


ఉద్యోగాలు ఇస్తామని మోదీ, కేసీఆర్ ప్రజలను మోసం చేశారని రేవంత్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఖాజీపేటకు ఇస్తానన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 




తాజాగా  ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే యోచనే లేదంటూ కేంద్ర రైల్వే శాఖ తాజాగా కుండబద్దలు కొట్టింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలోనే తెలంగాణలోని వరంగల్‌ జిల్లా కాజీపేటలో ‘ఇంటెగ్రల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)’ని ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర అపాయింట్‌మెంట్‌ డే నుంచి ఆరు నెలల్లోగా భారతీయ రైల్వే ఫీజిబిలిటీ స్టడీ చేస్తుందంటూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లోని 13వ షెడ్యూలు, ఐటెమ్‌ నెంబర్‌ 10 స్పష్టతనిచ్చింది. రైల్వే కనెక్టివిటీని పెంచడానికి కృషి చేస్తుందని వెల్లడించింది.

Updated Date - 2021-03-05T21:48:35+05:30 IST