Apr 16 2021 @ 14:05PM

కాజల్ మూడు నెలల్లో పూర్తి చేసిందా..!

పెళ్ళికి ముందు ఎంత జోరుగా ఉందో పెళ్ళి తర్వాత కూడా కాజల్ అదే జోరు కంటిన్యూ చేస్తోంది. పెళ్ళికి ముందు కమిటయిన సినిమాలు చేస్తూనే పెళ్ళి తర్వాత  కూడా కొత్త సినిమాలని కమిటవడం చూస్తే షాకింగా అనిపిస్తోంది. మెగాసార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్.. రీసెంట్‌గా అక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఆగిపోయిందనుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2 బ్యాలెన్స్ షూటింగ్ త్వరలో మొదలబోతోందని సమాచారం. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ .. కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని పాత్ర చేస్తోంది.

కాగా కాజల్ ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తోంది. ఆ సినిమాలు తనకి అంతగా కలిసి రాకపోయినా మేకర్స్ మాత్రం తనతో ఆ తరహా చిత్రాలను నిర్మించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళంలో 'గోష్టి' సినిమా చేసింది కాజల్ అగర్వాల్. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపిస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారట. ఈ సినిమాను కాజల్ కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ఎస్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇంత స్పీడ్‌గా సినిమాలు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఏడాదికి కాజల్ నుంచి ఓ అయిదారు సినిమాలు రావడం పక్క అని చెప్పుకుంటున్నారు.