Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 17:08:21 IST

Tiger Shroff: డేటింగ్ వదంతులపై స్పందించిన బాలీవుడ్ హీరో

twitter-iconwatsapp-iconfb-icon

జాకీ ష్రాఫ్ (Jackie Shroff) తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’, ‘బాఘీ’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. దిశా పటానికీ ఈ మధ్యే బ్రేకప్ చెప్పాడని పుకార్లు షికార్లు కొట్టాయి. ఈ వదంతులు హల్‌చల్ చేస్తుండగానే టైగర్‌కు సంబంధించిన ఓ వార్త బీ టౌన్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. 


టైగర్ ష్రాఫ్ తాజాగా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) అనే మోడల్, నటితో డేటింగ్ చేస్తున్నాడట. ఈ జంట గతంలో ‘కాసనోవా’ (Casanova) మ్యూజిక్ వీడియోలో నటించారు. ఈ వీడియో గతేడాది విడుదలైంది. అది మాత్రమే కాకుండా ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ 2.0’ (I am a Disco Dancer 2.0) మ్యూజిక్ వీడియోలో కూడా జంటగా కనిపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా టైగర్ ష్రాఫ్, ఆకాంక్షతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించాడు. కానీ, ఆకాంక్షతో డేటింగ్ కథనాలను మాత్రం అతడు కొట్టి పారేశాడు. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ఆరేళ్లు డేటింగ్ చేశారు. అనంతరం ఏమైందో తెలియదు కానీ ఈ జంట ఎవరి దారిని వారు చూసుకున్నారు. ఇక ఆకాంక్ష విషయానికి వస్తే.. ఆమె మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. మహేశ్ బాబు, కార్తి, వరుణ్ ధావన్‌లతో కలసి పలు యాడ్‌లు చేసింది. ‘త్రివిక్రమ’ (Trivikrama) తో దక్షిణాది ఇండస్ట్రీకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక టైగర్ ష్రాఫ్ ‘గణపత్’ షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు. ‘బడే మియా, చోటే మియా’, ‘స్ర్కూ ఢీలా’ వంటి ప్రాజెక్టులు ప్రస్తుతం అతడి చేతిలో ఉన్నాయి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement