జిబి వాట్సప్‌ వాడకం మంచిదేనా?

ABN , First Publish Date - 2020-09-05T05:02:11+05:30 IST

వాట్సప్‌ సోర్స్‌ కోడ్‌ని డీకంపైల్‌ చెయ్యడం ద్వారా అందులో ప్రత్యేకమైన ఫ్లాగ్‌లను తొలగించి

జిబి వాట్సప్‌  వాడకం మంచిదేనా?

చాలామంది గూగుల్‌ ప్లేస్టోర్లో లభించని జిబి వాట్సప్‌ డౌన్లోడ్‌ చేసుకుని ఇన్స్టాల్‌ చేసుకుంటున్నారు. ఈ యాప్‌ వాడటం మంచిదేనా?

- సొహెయిల్‌, కడప


వాట్సప్‌ సోర్స్‌ కోడ్‌ని డీకంపైల్‌ చెయ్యడం ద్వారా అందులో ప్రత్యేకమైన ఫ్లాగ్‌లను తొలగించి అదనపు సదుపాయాలు కల్పించేలా జిబి వాట్సప్‌ వంటివి పనిచేస్తాయి. వీటిని మాడెడ్‌ వాట్సప్‌లుగా పరిగణిస్తారు. ఉదాహరణకి వీటి ద్వారా పెద్ద స్థాయిలో వీడియో అటాచ్‌మెంట్లని పంపుకోవడం, ఆటో రిప్లయ్‌లు సెట్‌ చేయడం వంటి పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి.


అయితే జిబి వాట్సప్‌ వంటివి యూజర్లకి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని    దొంగిలిస్తున్నట్లు అనేక ఆధారాలతో బయటపడింది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వాట్సాప్‌ నియమాల ప్రకారం ఇలాంటి మాడెడ్‌ వెర్షన్లని వాడడం నిషిద్ధం. ఒకవేళ మీరు వాటిని వాడుతున్నట్లు వాట్సప్‌ సంస్థ గుర్తించినట్లయితే, మీ వాట్సప్‌ అకౌంట్‌ బ్లాక్‌ చేసే ప్రమాదం కూడా ఉంది!


Updated Date - 2020-09-05T05:02:11+05:30 IST