ఉచిత విద్యుత్‌కు మంగళమేనా..?

ABN , First Publish Date - 2022-10-01T05:26:33+05:30 IST

ప్రస్తుతం జిల్లాలో వ్యవసా య విద్యుత్‌ కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ కల్పి స్తోంది. ఎంత పొలం సాగులో ఉంది.? ఎన్ని మోటా ర్లు వినియోగిస్తున్నారు..? ఎన్ని గంటలు విద్యుత్‌ వా డుకుంటున్నారు.? వంటి నిబంధనలు లేకుండా ప్రస్తు తానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. అయితే మో టార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఒకటికి మించి ఎక్కువ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న వారికి ఉచిత విద్యుత్‌ వర్తించకుండా పోయే ప్రమాదముం దని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉచిత విద్యుత్‌కు మంగళమేనా..?

వ్యవసాయ మోటార్లకు.. మీటర్లపై ప్రభుత్వం దాగుడుమూతలు
చెప్పేదొకటి.. చేసేదొకటా అంటూ రైతుల మండిపాటు


వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులతో దాగుడు మూతలాడుతోంది. దీంతో చెప్పేదొకటి.. చేసేది మరొకటా అంటూ రైతులు మండిపడుతున్నారు. మోటార్లకు మీటర్లు బిగించి.. ఇప్పుడిస్తున్న ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే అనే అనుమానం రైతుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 22ను రద్దు చేయాలని రైతుసంఘాలు, రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా ఈ పథకం వల్ల రైతులకు జరగబోయే నష్టం ఏంటో..? ప్రభుత్వానికి మేలు ఏంటో ? ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం..

(రాయచోటి-ఆంరఽధజ్యోతి): ప్రస్తుతం జిల్లాలో వ్యవసా య విద్యుత్‌ కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ కల్పి స్తోంది. ఎంత పొలం సాగులో ఉంది.? ఎన్ని మోటా ర్లు వినియోగిస్తున్నారు..? ఎన్ని గంటలు విద్యుత్‌ వా డుకుంటున్నారు.? వంటి నిబంధనలు లేకుండా ప్రస్తు తానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. అయితే మో టార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఒకటికి మించి ఎక్కువ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న వారికి ఉచిత విద్యుత్‌ వర్తించకుండా పోయే ప్రమాదముం దని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్ర స్తుతం 1,25,015 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నా యి. నియోజకవర్గాల వారీగా చూస్తే.. రాయచోటిలో 22,928, రాజంపేట 27,586, కోడూరు 15,143, పీలేరు 23,082, మదనపల్లె 22,454, తంబళ్లపల్లె 13,822 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో చాలా మండలాలు తీ వ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఖరీ ఫ్‌, రబీ సీజన్‌లకు వర్షాధారమే కీలకం. చెరువులు, కుంటలు చాలా వరకు నీటి చుక్క లేకుండా ఎండిపో యి ఉంటాయి. దీంతో రైతులు విధి లేక.. బోర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. దీంతో మోటార్లు బిగించుకుం టారు. ఉన్న పొలం అంతటినీ సాగు చేసుకునేందుకు చాలా మంది ఒకటికి మించి వ్యవసాయ విద్యుత్‌ కనె క్షన్లు కలిగి ఉన్నారు. వీరందరికీ భవిష్యత్తులో ఉచిత విద్యుత్‌ అందకపోవచ్చు. మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమానికి రైతుల నుంచి అనుమతి పత్రాన్ని ప్ర భుత్వం సేకరిస్తోంది. రైతుల నుంచి ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంటు, పట్టాదారు పాసుపుస్తకం సేకరిం చి.. వివరాలు నమోదు చేస్తోంది. దీని వల్ల మొత్తం 1,25,015 విద్యుత్‌ కనెక్షన్లలో ఎవరెవరికి ఒకటికి మిం చి విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయో..? ప్రభుత్వం వద్ద జా బితా ఉంటుంది. ఈ జాబితా సిద్ధం కాగానే.. ప్రభు త్వం తనకు అనుకూలంగా ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే  అవకాశం ఉంది. దీనిపైనే రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం చెప్తోంది ఏంటి ?
మోటార్లకు మీటర్లు బిగిస్తే... రైతులకు ఎటువంటి న ష్టం ఉండదు.. విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టవచ్చు. నాణ్య మైన విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవు.. ఉచిత విద్యుత్‌ పథకానికి డోకా ఉండదు. అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ మాటల ను రైతులు నమ్మడం లేదు. విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్ట డానికి, నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి వేరే మా ర్గాలు ఉన్నా.. ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించా లనుకోవడం పైనే రైతులు ఆందోళన చెందుతున్నారు. మోటార్లకు మీటర్లు బిగించాలంటే.. వందల కోట్లు వ్యయం చేసి మీటర్లు కొనుగోలు చేయాలి. వాటికి రీడింగ్‌ తీసేందుకు, ఇతర నిర్వహణ కోసం అదనంగా సిబ్బందిని నియమించుకోవాలి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపైన ఆర్థిక భారమే.. అయినా రాష్ట్ర ప్రభు త్వం మోటార్లకు మీటర్ల ఏర్పాటు వైపే మొగ్గు చూపు తోంది. వాస్తవంగా విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టాలంటే.. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించవచ్చు. దీనివల్ల రైతుల మీద ఎటువంటి భారం పడదు.

ప్రజలకున్న భయం ఏంటి ?
సాధారణంగా డిస్కంలు విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను కొంటాయి. ఈ విద్యుత్‌ను డిస్కంలు వినియోగదారులకు సరఫరా చేస్తాయి. అయితే విద్యుత్‌ సరఫరాలో లైన్లలో సబ్‌స్టేషన్ల లో విద్యుత్‌ ప్రవహిస్తున్నప్పుడు కొంత విద్యుత్‌ను నష్టపోతారు. అదే సమయంలో కొందరు (వ్యవసాయ, వ్యవసాయేతర వ్యక్తులు) అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తారు. ఈ లెక్కలు చూసినప్పుడు విద్యుత్‌ సంస్థల నుంచి తాము కొనుగోలు చేసిన విద్యుత్‌కు.. వినియోగం అవుతున్న విద్యుత్‌కు లెక్కల్లో తేడా ఉంటుంది. దీంతో డిస్కంలు నష్టపోతున్నాయి. ఈ నష్టాన్ని రైతుల నుంచే రాబట్టేం దుకు మోటార్లకు మీటర్లు బిగిస్తోందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ట్రాన్స్‌ఫా ర్మర్లకు మీటర్లు బిగిస్తే.. విద్యుత్‌ నష్టం, చౌర్యం ఖచ్చి తంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మీటర్లు బిగించాల్సి ఉండదు. సిబ్బంది అవసరం కూడా పెద్ద గా ఉండదు. ఈ పద్థతినే రైతు సంఘాలు, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అదే విధంగా తీరా మోటార్లకు మీటర్లు బిగించిన తర్వాత.. ప్రస్తుతం అమ్మఒడి, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, విద్యాదీవెన వంటి అనేక పథకాలకు నిబంధనలు మార్చి లబ్ధిదారుల సంఖ్యను కుదించినట్లు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకం లో లబ్ధిదారులను కూడా తగ్గించేస్తారేమోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగూ ఉచిత విద్యుత్‌ ఇస్తోంది కదా.. అటువంటప్పుడు మోటార్లకు మీటర్లు బిగించాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో 98 శాతం పూర్తి
డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పథకం కింద రైతుల అకౌంటుకు ప్రభుత్వం వేసిన మొత్తాన్ని డిస్కంలకు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని.. రాష్ట్ర ప్ర భుత్వం రైతుల నుంచి ఒప్పందాలు చేస్తోంది. ట్రాన్స్‌కో లైన్‌మెన్‌ ఆయా గ్రామాల్లో రైతుల నుంచి ఈ మేరకు ఒప్పంద పత్రాలు తీసేసుకున్నారు. ఉన్నతాధికారులు లైన్‌మెన్లకు లక్ష్యాలు నిర్దేశించడంతో.. లైన్‌మెన్లు రైతులపై సామధాన దండోపాయాలు ఉపయోగించి ఒప్పంద ప్రతాలు తీసుకున్నట్లు సమాచారం. ఫలితం గా జిల్లాలో ఇప్పటికి సుమారు 98 శాతం మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఇచ్చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం శ్రీకా కుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఉన్న ఈ పథకం త్వరలోనే.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. అప్పుడు రైతుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఎదురవుతాయో చూడాల్సి ఉంది.

ఒప్పుంద పత్రం ఇచ్చా..
నాకు వ్యవసాయ మో టారు ఉంది. లైన్‌మెన్‌ వచ్చి ఆధార్‌కార్డు, పట్టా దారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంటు పత్రాలు అడిగాడు. వాటిని అందజేసి, ఒప్పంద పత్రం మీద సంతకం చేశాను.
- రెడ్డెయ్య, కెకె హరిజనవాడ, సంబేపల్లె

రైతులకు ఎటువంటి నష్టం లేదు..
వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి నష్టం జరగదు. ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా సుమారు 98 శాతం మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
- చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ, ఏపీ ట్రాన్స్‌కో, అన్నమయ్య జిల్లా

Updated Date - 2022-10-01T05:26:33+05:30 IST