టీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే పాపాత్ములా?

ABN , First Publish Date - 2021-03-08T05:18:59+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేయకపోతే, పాపాత్ములా అని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే పాపాత్ములా?
ఎంపీ అరవింద్‌ను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

- ఓటర్లకు శాపాలు పెట్టేటోడు మినిస్టరేనా?

- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్‌కు డౌట్‌ ఉంది

- చిన్నారెడ్డి పట్టభద్రుల సమస్యలపై ఎన్నడైనా మాట్లాడారు?

- నాగేశ్వర్‌ గట్టోడు కాదు

- బీజేపీ అంటేనే ఐడియాలజీ

- రామచందర్‌రావును గెలిపిస్తే యువతకు భవిష్యత్‌ ఉంటది

- నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌


జడ్చర్ల, మార్చి 7 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేయకపోతే, పాపాత్ములా అని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. కేసీఆర్‌ మంచిగా పని చేసి, సమయానికి సచివాలయానికి వెళ్లి, ఇచ్చిన హమీలలో 60 నుంచి 70 శాతం అమలు చేసి ఉంటే ఎమ్మెల్సీ ఎ న్నికలలో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందన్న డౌట్‌ వచ్చేది కాదని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓడిపోతామన్న డౌట్‌ వచ్చిన నాడే మీ నాయకుడు పనికిమాలినోడని అర్థ మైందని ఆరోపించారు. ఓటర్లకు శాపాలు పెట్టే శ్రీనివాస్‌గౌడ్‌ మినిస్టరేనా.. అని ప్రశ్నించారు. అత్యధిక సభ్యులున్న సోషల్‌ మీడియాను ఎంచుకోకుండా, కేవలం 1.20 కోట్ల మంది ఉన్న ట్విట్టర్‌ను కేటీఆర్‌ ఎంచుకుని, ట్వీట్స్‌ చేస్తుంటాడని ఆ రోపించారు. కొన్ని రోజుల కిందట సీఎం మార్పుపై చర్చ జరిగిందని, కేటీఆర్‌ సీఎం అవుతారంటూ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు లు మాట్లాడారని గుర్తు చేశారు. ఒక వేళ అలా జరిగితే 43 మంది ఎమ్మెల్యేలు హరీశ్‌రావు టెంట్లకు పోతరనే ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ వచ్చిందని చెప్పారు. దీంతో ఈ అంశంపై ఎవరైనా మాట్లాడితే తోలుతీస్తా అంటూ కేసీఆర్‌ తిట్టిన సంగతి మరిచిపోరాదని సూచించారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమై నవని అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పీవీ బిడ్డ అని, ఆమె ఓడిపోతే ఓటమి  టీఆ ర్‌ఎస్‌ ఖాతాలోకి రాదని, పీవీ కుటుంబం ఖాతాలో వేస్తారని చెప్పారు. గ్రాడ్యుయేటు, టీచర్లు, యూనివర్సిటీల సమస్యలపై ఏనాడైన చిన్నారెడ్డి మాట్లాడిం డా? ఈ అంశాలపై కేసీఆర్‌తో కొట్లాడిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించా రు. కమ్యూనిస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ గట్టోడు కాదని, ఏదై నా ఉంటే వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెడ్తాడే తప్ప, ఇంకేమి చేయ లేడని అన్నారు. తెలంగాణలో యువత బాగుపడాలంటే, యుద్ధం చేసే సైనికు లు కావాలని అన్నారు. అలాంటి వారు కేవలం బీజేపీలోనే ఉన్నారని చెప్పారు. బీజేపీ అంటేనే ఐడియాలజీ అని, రామచందర్‌రావుకు ఓటేస్తే యువకుల ఉజ్వ ల భవిష్యత్తుకు ఓటేసినట్టేనని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకు లు శాంతకుమార్‌, శ్రీవర్ధన్‌రెడ్డి, పాలాది రాంమోహన్‌, మధుసూదన్‌యాదవ్‌, మిథున్‌రెడ్డి, రాపోతుల శ్రీనివాస్‌గౌడ్‌, వెంకట్‌రాంరెడ్డి, రమేశ్‌జీ, సాహితి, వెంక ట్‌, నందీశ్వర్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:18:59+05:30 IST