‘ప్రశ్నించడమే నేరమా?’

ABN , First Publish Date - 2021-11-26T05:53:48+05:30 IST

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ఆధ్వర్యంలో నవంబరు 18న వివిధ ప్రజా సంఘాల కార్యకర్తల ఇండ్లపై దాడులు జరిగాయి. ఇళ్లలోకి ఎవరినీ రానీయకుండా, ప్రెస్‌ వాళ్లను కూడా అనుమతించకుండా వందలాది పోలీసులను పహారాగా ఉంచి...

‘ప్రశ్నించడమే నేరమా?’

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ఆధ్వర్యంలో నవంబరు 18న వివిధ ప్రజా సంఘాల కార్యకర్తల ఇండ్లపై దాడులు జరిగాయి. ఇళ్లలోకి ఎవరినీ రానీయకుండా, ప్రెస్‌ వాళ్లను కూడా అనుమతించకుండా వందలాది పోలీసులను పహారాగా ఉంచి, పరిసరాల ప్రజలను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. సెల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్కులు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం, న్యాయబద్ధ హక్కుల సాధనకు రాజ్యాంగబద్దంగా ఈ ప్రజా సంఘాలు బహిరంగంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి..


సమాజంలో బలవంతులు, బలహీనులు ఉంటూనే ఉన్నారు. అంతే కాక సమాజంలో అతి బలవంతులు కూడా ఉంటారు. వారు రాజ్యం రూపంలో ఉంటారు. బలహీనులకు ఎప్పుడూ న్యాయం దొరకకుండా బలవంతులు, అతి బలవంతులు బలంగా ప్రయత్నిస్తుంటారు. ఆ స్థితిలోనే బలహీనులకు ప్రజా గొంతుకలుగా ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు మద్దతుగా నిలబడతాయి. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఎ దాడులు తీవ్ర స్ధాయిలో కొనసాగుతున్నాయి. నిరసన తెలపడం, భావ ప్రకటన సేచ్ఛా హక్కులో భాగమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఊపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌ఐఎ లాంటి దర్యాప్తు సంస్థలను కూడా రద్దు చేయాలి. వాటి వల్ల అప్రజాస్వామిక అణచివేత కొనసాగుతున్నదే తప్ప, రాజ్యాంగ వ్యవస్థ విధానాలు అమలు కావడం లేదు. ఆ విధానాలను ఎజెండాగా స్వీకరించి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలపై నిషేధం విధించినా, నిశ్శబ్దం కాని ప్రజాస్వామిక గొంతులు మౌనం వహించేలా చేసేందుకు ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. ఈ అమానుష వేటను నిలువరించాల్సిన బాధ్యత ప్రజాస్వామిక శక్తులపై ఉంది.

ఎన్‌. నారాయణరావు

పౌర హక్కుల సంఘం

Updated Date - 2021-11-26T05:53:48+05:30 IST