వేసవి కదా అని వారానికి రెండు మూడు సార్లు ఐస్‌క్రీమ్స్ తినేస్తున్నారా..?

ABN , First Publish Date - 2022-06-04T20:52:46+05:30 IST

ప్రస్తుతం పిల్లల ఫేవరెట్‌ ఫుడ్‌ ఐస్‌ క్రీమ్స్‌. ఎండలు తగ్గేవరకూ అంతే. ఇలా తరచూ ఐస్‌క్రీమ్స్‌ తినడం పిల్లలకు మంచిదేనా

వేసవి కదా అని వారానికి రెండు మూడు సార్లు ఐస్‌క్రీమ్స్ తినేస్తున్నారా..?

ఆంధ్రజ్యోతి(04-06-2022)

ప్రశ్న: ప్రస్తుతం పిల్లల ఫేవరెట్‌ ఫుడ్‌ ఐస్‌ క్రీమ్స్‌. ఎండలు తగ్గేవరకూ అంతే. ఇలా తరచూ ఐస్‌క్రీమ్స్‌ తినడం పిల్లలకు మంచిదేనా?


- రాగిణి, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: సాధారణంగా బజారులో దొరికే ఐస్‌ క్రీమ్స్‌ను చక్కెర, కొవ్వు పదార్థాలతో తయారుచేస్తారు. అధిక క్యాలరీలు, కృత్రిమ రంగులు, రసాయనిక ప్రిజర్వేటివ్స్‌ మొదలైన వాటిని తయారీలో వాడతారు. అందుకే ఐస్‌క్రీమ్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే దంతాల సమస్యలు, అధిక బరువు, ఊబకాయంతో పాటు కాలేయానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని పరిశోధనల్లో తెలు స్తోంది. కాబట్టి పిల్లలకు వీటిని తరచుగా ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. అయితే, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉండే ఐస్‌ క్రీమ్స్‌ తినాలనిపించడం సహజం. అటువంటప్పుడు పండ్లు, పాలు లేదా పెరుగుతో, చక్కెర లేకుండానే లేదా తక్కువ వేసి, కొవ్వులు తగ్గించి ఇంట్లోనే కుల్ఫీల్లాంటివి చేసుకుంటే ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ కాపాడుకున్నట్టే. ఎప్పుడూ ఇంట్లోనే తయారు చెయ్యాలంటే కష్టమే కాబట్టి, పక్షానికో నెలకో ఒకసారి, అదీ కొద్ది మొత్తంలో మాత్రమే మంచి నాణ్యత ఉన్న ఐస్‌ క్రీమ్స్‌ని ఇవ్వవచ్చు. వేసవి కదా అని వారానికి రెండు మూడు సార్లు బయటి నుంచి ఐస్‌ క్రీమ్స్‌ తెస్తే మాత్రం ఎవరి ఆరోగ్యానికైనా ముప్పే.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-04T20:52:46+05:30 IST