Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుడ్డుతో గుండె ఆరోగ్యం

ప్రతిరోజూ గ్లాసు పాలూ, ఒక కోడిగుడ్డూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. కానీ కోడి గుడ్లలో కొలెస్ట్రాల్ ఎక్కువ కనుక గుండెకు మంచిది కాదన్న అభిప్రాయం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. ఇది తప్పు అన్న విషయం ఇటీవల  చేసిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది. కోడిగుడ్డు వల్ల గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్ పెరగడానికీ, కోడిగుడ్డు తినడానికి సంబంధం లేదని తేల్చారు కెనడా మెక్ మాస్టర్ యూనివర్సిటీ, హామిల్టన్ హెల్త్ సైన్సెస్‌కి చెందిన పరిశోధకులు. లక్షా 77 వేల మందిపై అధ్యయనం చేసిన అనంతరం వాళ్లు ఈ విషయం చెబుతున్నారు. వీరిలో సగానికి పైగా గుడ్డు, పాలు తీసుకునే వారున్నారు. వీరిలో 13,658 మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారే! అయితే వీరి గుండెజబ్బుకీ, కోడిగుడ్డుకీ సంబంధం లేదన్న విషయం తేలింది. ప్రొటీన్లు, పోషకాలు లభించే కోడిగుడ్డు తినడమే మంచిదని పరిశోధకులు అంటున్నారు.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...