Abn logo
May 30 2020 @ 22:02PM

ప్రభాస్‌కు దీపికా ఫిక్స్ అయినట్టేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం పూర్తవ్వగానే ప్రభాస్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారు. భారీ తారాగణంతో పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం అంతే భారీగా రూపొందించేందుకు వైజయంతీ సంస్థ సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఈ మధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయినే నటిస్తుందనేది ఫిక్సయినప్పటికీ ఆ హీరోయిన్ ఎవరనే విషయంలోనే చర్చలు నడుస్తున్నాయి. 


ఫస్ట్ ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే అని అన్నారు. మళ్లీ రెండు రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ నటి అలియా భట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ హీరోయిన్‌గా దాదాపు దీపికానే ఫిక్స్ అనేలా వార్తలు మళ్లీ మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా దీపికా పదుకొనే.. అందరూ ‘మహానటి’ సినిమా చూడండి అని ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే నాగ్ అశ్విన్ తెల్లవారు జామున కూల్ నోటిఫికేషన్ వచ్చింది.. అంటూ కామెంట్ చేశారు. అయితే వీరిద్దరి పోస్ట్‌లు చూసిన వారంతా దీపికానే ప్రభాస్ హీరోయిన్ అంటూ సందడి మొదలెట్టారు. మరి ఈ సమయంలో దీపికా ‘మహానటి’ పేరు తీసుకురావడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ కోణంలో ఆలోచిస్తే.. దీపికా కన్ఫర్మ్ అయినట్లే అనుకోవచ్చు. చూద్దాం.. దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు, ఎలా వస్తుందో.. 

Advertisement
Advertisement
Advertisement