Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 21 Sep 2022 12:34:02 IST

Coffee during Pregnancy: గర్భం దాల్చిన వాళ్లు కాఫీ తాగకూడదా..? తాగితే జరిగేదేంటి..?

twitter-iconwatsapp-iconfb-icon
Coffee during Pregnancy: గర్భం దాల్చిన వాళ్లు కాఫీ తాగకూడదా..? తాగితే జరిగేదేంటి..?బిందు ఉదయాన్నే నిద్ర లేస్తుంది, ఇంటి పనులు చక్కబెట్టడానికి ముందు ముఖం కడుక్కుని, వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తాగుతుంది. కాఫీ గుభాళింపు ఆమెకు పెద్ద బూస్టింగ్‌. కాఫీ తాగడం వల్ల వచ్చిన ఎనర్జీతో ఇంటి పనులన్నీ చకచకా చేసేస్తుంది. అస్సలు ఆమెలో అలసటే కనిపించదు. ప్రతీరోజూ ఆమె దినచర్య ఇదే. బిందు ఇటీవల ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాతే ఆమెలో కొత్త భయం మొదలయింది. అదే.. తనకు ఉన్న ఏకైక అలవాటు అయిన కాఫీ గురించే. అవును.. గర్భందాల్చిన వాళ్లు కాఫీ తాగకూడదంటూ సన్నిహితులు, బంధువులు పదే పదే హెచ్చరిస్తూ ఉండటంతో ఆమెలో టెన్షన్ మొదలయింది.


ఇది బిందు సమస్య మాత్రమే కాదు. కాఫీ తాగే అలవాటు ఉన్న ప్రతీ స్త్రీ ఎదుర్కొనే సమస్యే. గర్భం దాల్చిన తర్వాత కొన్ని కొన్ని అలవాట్లను బలవంతంగా దూరం పెట్టాల్సి వస్తుంటుంది. పెద్దల ఒత్తిడితో కాఫీ తాగే అలవాటును కూడా కొందరు మానేస్తుంటారు. అయితే నిజంగా గర్భం దాల్చిన వారు కాఫీ తాగకూడదా..? తాగితే ఏమవుతుంది..? వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాన్ని తెలుసుకుందాం. 


వాస్తవానికి కాఫీలో ఉన్న కెఫిన్ వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ రక్తపోటు ఉన్నవారు, గుండె సంబంధ సమస్యలు  ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. కాఫీ ఎక్కువగా అలవాటు అయితే అదొక డ్రగ్ లాగా పనిచేస్తుందనే విషయం చాలా మందిలో గమనిస్తూ ఉంటాం కూడా. గర్భవతులుగా ఉన్న మహిళలు కాఫీని తాగవచ్చా లేదా అనే విషయాల గురించి అధ్యయనాలు జరిపినపుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కాఫీలో ఉండే కెఫిన్ తల్లి కడుపులో ఉన్న శిశువులోకి చొచ్చుకుని పోయి శిశువు ఎదుగుదలకు, ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందన్నది ఓ పరిశోధనలో తేలింది. గర్భవతులుగా ఉన్నవారు కాఫీని ఎక్కువగా తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ ప్రభావం కడుపులో బిడ్డ మీద పడుతుంది. ఫలితంగా ఎదుగుతున్న బిడ్డలో జుట్టు రంగు విషయంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక గర్భవతుల విషయంలో అయితే గర్భస్రావం జరగడం, నెలలు నిండకముందే ప్రసవం జరగడం, కడుపులో బిడ్డ సరైన బరువు లేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.


సాధారణంగానే కొంతమంది మహిళలు ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లు ఉన్నవారికి గర్భం దాల్చిన సమయంలో ఆ అలవాట్లకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటారు, వాటిలో పెద్ద మొత్తం కెఫిన్ కలిగి ఉండటమే దానికి కారణం అవుతుంది. కాఫీ కూడా 200 మి.లీ లకు మించి తీసుకుంటేనే అందులో ఉండే కెఫిన్ వల్ల పైన చెప్పుకున్న నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 200 మి.లీ. కంటే తక్కువ పరిణామంలో కాఫీని తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా గుండె సంబంధ సమస్యలు ఉన్నవారిలో కెఫిన్ వినియోగం ఎక్కువైతే గుండె స్పందన రేటు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలుంటాయి. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం కూడా సంభవించవచ్చు. చక్కెర, పాలు కలపని కాఫీ ని రోజులో ఒక పరిమితిలో తీసుకుంటే పర్లేదు. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. ఏదిఏమైనా గర్భవతులు రిస్క్ తీసుకోకూడదంటే మాత్రం కాఫీకి దూరంగా ఉండటమే మంచిది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.