Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 01 Jul 2021 08:01:55 IST

దేవీశ్రీప్రసాద్ హీరోగా చార్మి సినిమా..?

twitter-iconwatsapp-iconfb-icon

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నటి, నిర్మాత చార్మి ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా సౌత్ అండ్ నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న దేవీశ్రీప్రసాద్ అప్పుడప్పుడు స్క్రీన్ మీద హుషారుగా సందడి చేస్తుంటాడు. ఆయనలో హీరో కళ బాగానే కనిపిస్తుంది. అందుకే గతంలో ఈయన హీరోగా సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో ఆ తర్వాత దీని గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ న్యూస్ వచ్చింది. 'జ్యోతిలక్ష్మి' సినిమా తర్వాత నిర్మాతగా మారిన చార్మి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ కరణ్ భాగస్వామ్యంతో పూరి - చార్మి విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే దేవీశ్రీప్రసాద్ హీరోగానూ చార్మి ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ విషయంలో చార్మిగాని, దేవీశ్రీ గానీ ఇంకా స్పందించలేదు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement