Apr 13 2021 @ 12:32PM

'శాకుంతలం'కి బ్రేక్ ..?

మళ్ళీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద బాగానే చూపిస్తోంది. ఇప్పటికే ముంబై పరిశ్రమతో పాటు తెలుగు సినీ పరిశ్రమలోనూ పలువురు స్టార్స్ కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఇప్పటికే కోవిడ్ నుంచి కోలుకోవడానికి సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ గుణశేఖర్‌కి కూడాకోవీడ్-19 పాజిటివ్ అనే మాట వినిపిస్తోంది. దర్శకుడు నుంచి ఇంకా దీనికి సంబంధించిన అధికారకమైన కన్‌ఫర్మేషన్ లేనప్పటికి ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ కారణంగా గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం' సినిమా షూటింగ్ తాత్కాలికంగా పోస్ట్‌పోన్ చేసినట్టు తాజా సమాచారం. సమంత అక్కినేని శకుంతలగా మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. గుణ టీం వర్క్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పిస్తున్నాడు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం సమంత బల్క్‌గా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి గుణశేఖర్ భారీ సెట్స్‌ని నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సెట్స్‌లో శాకుంతలం చిత్రీకరణ జరుపుతున్నారు.