- నేడు ఇంగ్లండ్‌తో ఫైనల్
- మహిళల వరల్డ్‌కప్
- ఉ.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
ఆక్లాండ్: మహిళల వన్డే వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. అత్యంత పటిష్ట జట్లయిన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం నాటి ఫైనల్ రసవత్తరంగా జరుగనుంది. తాజా టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆసీస్ భీకర ఫామ్‌లో ఉంది. ఆరుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టును ఓడించాలంటే ఇంగ్లండ్ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చాల్సిందే. గాయంతో సెమీ్‌సకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ కోలుకోవడం ఆసీస్‌కు లాభించనుంది. ఇక నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టింది. అయితే ఆదిలోనే వరుసగా మూడు ఓటములు ఎదుర్కొని అవకాశాలను క్లిష్టం చేసుకున్నా అద్భుత రీతిలో పుంజుకుంది. ఈ ఆత్మవిశ్వాసంతోనే ఆసీ్‌సను కూడా దెబ్బతీయాలనుకుంటోంది. జట్టంతా పూర్తి ఫిట్‌నె్‌సతో ఉండడం సానుకూలాంశం. మరోవైపు 34 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచకప్ తుది పోరులో ఢీకొనబోతున్నాయి. ఒకవేళ ఇంగ్లండ్ టైటిల్ గెలిస్తే 21వ శతాబ్ధంలో వరల్డ్‌క్‌పను నిలబెట్టుకున్న తొలి మహిళల జట్టుగా నిలుస్తుంది.