Abn logo
Jul 13 2020 @ 12:57PM

అనుష్క రిటైర్‌మెంట్ ..నిజ‌మెంత ‌..?

నేటితరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అనుష్క శెట్టికి ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. గ్లామ‌ర్ పాత్ర‌లే కాదు.. లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లోనూ అనుష్క శెట్టి త‌న‌దైన ముద్ర వేసి అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్నారు. అరుంధ‌తి, భాగ‌మ‌తి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో అనుష్క మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అనుష్క ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే బాహుబ‌లిలో రాజ‌మౌళి దేవ‌సేన అనే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కాగా.. ఈమె కెరీర్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. యాక్టింగ్ కెరీర్ నుండి అనుష్క రిటైర్మెంట్ తీసుకోనుంద‌ని, మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే అనుష్క ఏమైనా స్పందిస్తుందేమో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement