చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చిందా ?

ABN , First Publish Date - 2020-08-07T02:36:53+05:30 IST

వైరస్ విషయంలో పొరుగు దేశమైన చైనా నుంచి రోజుకో కొత్త వార్త వినవస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విస్తరించిన కరోనా నుండి కోలుకోలేక సంతమవుతోన్న పరిస్థితులున్న విషయం తెలిసిందే. దీని ప్రతాపం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులను చూస్తుంటే కరోనా ఎప్పటికి శాంతిస్తుందోనన్న విషయం అర్ధం కాని పరిస్థితి.

చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చిందా ?

న్యూఢిల్లీ : వైరస్ విషయంలో పొరుగు దేశమైన చైనా నుంచి రోజుకో కొత్త వార్త వినవస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విస్తరించిన కరోనా నుండి కోలుకోలేక సంతమవుతోన్న పరిస్థితులున్న విషయం తెలిసిందే. దీని ప్రతాపం ఇప్పట్లో  ఆగేలా కనిపించడంలేదు.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులను చూస్తుంటే కరోనా ఎప్పటికి శాంతిస్తుందోనన్న విషయం అర్ధం కాని పరిస్థితి. 


 ఈ క్రమంలో ప్రజలను ఆందోళనకు గురి చేసే మరో వార్త బయటకు వచ్చింది. అదే... ‘చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది’. ఈ కొత్త వైరస్ కారణంగా ఆ దేశంలో ఇప్పటికే ఏడుగురు మృతి చెందగా, మరో అరవై మందికి పైగా ఈ వైరస్ బారినపడి అనారోగ్యానికి గురైనట్లుగా వినవస్తోంది. 



కాగా ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇకపోతే తూర్పు చైనాలోని జియాంగ్ ప్రావిన్స్‌లో గత ఆరు నెలల్లో సుమారు 36 మంది వరకు ఈ ఎస్ఎఫ్‌టీఎస్ వైరస్ బారినపడ్డారని, అక్కడి నుండి తూర్పు చైనాలోని అన్ హుయి ప్రావిన్స్‌లో 23 మందికి సోకినట్లు నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. 



ఈ వైరస్ నాన్ జియాంగ్‌కు చెందిన ఓ మహిళకు సోకగా, ఆమెకు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయని సమాచారం. దాంతోపాటు ఆమె శరీరంలో ల్యూకోసైట్, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినట్లు వైద్యులు తెలిపారు. కాగా... నెల రోజుల చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. కాగా జంతువుల శరీరానికి అంటుకుని, తరువాత మనుషులకు వ్యాపించే నల్లి వంటి కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


అయితే ఈ వైరస్‌ కొత్తదేమీ కాదని, తొమ్మిదేళ్ళ క్రితమే... అంటే 2011 లోనే చైనాలో దీనిని కనుగొన్నారని నిపుణులు చెబుతున్నారు. కాగా... కరోనాతో భయపడుతున్న ప్రజలు... చైనాలో జంతువులను తినడం మానుకుంటే తప్ప ప్రపంచానికి రోగాల పీడ విరగడ కాదని భావిస్తున్నారంటే ఆశ్చర్యమనిపించదన్న వ్యాఖ్యానాలూ వినవస్తుండడం గమనార్హం. 


Updated Date - 2020-08-07T02:36:53+05:30 IST