May 7 2021 @ 11:53AM

అమీర్ సిద్దమవుతున్నాడా..?

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు అమీర్ సిద్దమవుతున్నట్టు బీటౌన్ మీడియాలో టాక్ వినిపిస్తోందట. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. కాశ్మీర్‌లో ప్రస్తుతం పాక్షిక లాక్ డౌన్ ఉండటంతో అక్కడ షూటింగ్‌కు అంతగా ఆంక్షలు లేవని తెలుస్తోంది. అందుకే కాశ్మీర్‌లో కొన్ని యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు మిస్టర్ పర్‌ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.