Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 29 Mar 2022 10:04:56 IST

రాజమౌళిని అన్‌ఫాలో, RRR పోస్టులు డిలీట్.. అసలు అలియా భట్‌కి ఏమైంది?

twitter-iconwatsapp-iconfb-icon

‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ దాదాపు ఐదేళ్లకి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా సైతం ‘బాహుబలి’ తరహాలోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. 


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాతో సౌత్‌లోని అన్ని భాషలకి హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఈ మూవీలోని తన పాత్రపై ఈ బ్యూటీ అసంతృప్తిగా ఉందని టాక్. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని అన్‌ఫాలో చేసిందని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన అన్ని పోస్టులను ఈ తార సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసిందట. నాలుగు రోజుల క్రితం విడుదలై సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ గురించి ఈ బ్యూటీ ఓ పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో సినిమాలోని తన పాత్ర పరిధిపై ఈ భామ కోపంగా ఉందనే రూమర్స్‌కి బలం చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా జరుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో అలియా అంత యాక్టివ్‌గా లేదు.


నిజానికి ఈ సినిమాలో అలియా క్యారెక్టర్ చాలా చిన్నదే. కానీ కథలో కీలక సమయంలో వస్తుంది. అయితే ఈ రూమర్స్‌పై ఆర్ఆర్‌ఆర్ టీం, రాజమౌళి, అలియాలో ఎవరూ స్సందించలేదు. వీటిలో ఎంతవరకు నిజం ఉందో వారిలో ఎవరైనా స్పందిస్తే కానీ తెలియదు. కాబట్టి ముందుగానే వీటిపై ఓ నిర్ణయానికి రావడం కరెక్టు కాదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వార్తల గురించి ఈ స్టార్స్ ఏమంటారో చూడాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement