జవాబుదారితనంలేని అధికారులు..

ABN , First Publish Date - 2021-01-14T06:29:35+05:30 IST

తూప్రాన్‌, జనవరి 13: మంత్రులు, శాసనసభ్యులకు ప్రజలు తమ ఇబ్బందులు తెలియజేసేందుకు వారి వద్దకెళ్తే అధికారులతో పనులు చేయించడం నాయకుల ధర్మమని

జవాబుదారితనంలేని అధికారులు..

 పైరవీకారులుగా కార్యకర్తలు

 ‘హౌసింగ్‌’ మాజీచైర్మన్‌ భూంరెడ్డి ఆవేదన


 తూప్రాన్‌, జనవరి 13: మంత్రులు, శాసనసభ్యులకు ప్రజలు తమ ఇబ్బందులు తెలియజేసేందుకు వారి వద్దకెళ్తే అధికారులతో పనులు చేయించడం నాయకుల ధర్మమని గృహనిర్మాణ సంస్థ మాజీచైర్మన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మడుపు భూంరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాను చూ స్తే అధికారుల్లో జవాబుదారితనం లేదని కార్యకర్తలను పైరవీకారుల్లా తయారుచేశారని ఆయన ఘాటైన వాఖ్యలు చేశారు. మంత్రులు, శాసనసభ్యులు ఎవరికి వారే ఉత్తరాల మీద సంతకాలు చేసి అధికారు ల వద్దకు పంపడం బాధాకరమన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాధ్యత కలిగిన మం త్రులు, శాసనసభ్యులు వారు తయారు చేసిన చట్టాలు అమలవుతున్నాయా? లేదా చూడాలన్నారు. శాసనం ద్వారా నిర్మితమైన చట్టాన్ని ప్రజలకు అందజేయడం మంత్రి బాధ్యత అన్నారు. దీనిని వ్యక్తిగత పరిధికి పరిమితం చేయడంతో గజ్వేల్‌ నియోజకవర్గంలో అధికారులు జవాబుదారితనం కోల్పోతున్నట్లు భూంరెడ్డి ఆరోపించారు.  ప్రజాశ్రేయస్సు కోరే ప్రజాప్రతినిధులు, సం బంధిత అధికారులు ఇప్పటికైనా గమనించాలన్నారు. మొన్ననే ధరణిపై ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా కలెక్టర్లు కిందిస్థాయి అధికారులను జవాబుదారితనం చేసి శాసనసభ్యులు చేసిన చట్టాన్ని అమలు చేయాలన్నారు.  తూప్రాన్‌ మున్సిపాలిటీలో ప్రజాసమస్యల పరిష్కారానికి, పరిశుభ్రతకు కొన్ని పద్ధతలు రూపొందిస్తే వాటికి భిన్నంగా అధికారులను ఆదేశించి పనిచేయడంతో ఈరోజు యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులు సూచించిన విధంగా అమలు చేయని అధికారి, కర్తవ్యం నిర్వర్తించే ప్రజాప్రతినిఽధి కూడా విస్మరించడంతో అనర్థాలకు దారితీస్తుందన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలుగానీ సక్రమపద్ధతిలో మెదిలితేనే అక్రమ నిర్మాణాలు కూల్చే పరిస్థితి ఈరోజు రాకపోయేదన్నారు. అక్రమ నిర్మాణాలంటూ ఈరోజు కూల్చివేయడంతో, తూప్రాన్‌లో కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు.


===========================================================================================


Updated Date - 2021-01-14T06:29:35+05:30 IST