Abn logo
Mar 7 2021 @ 00:08AM

ఉపాధిలో అక్రమాలు

  1. రూ.12 లక్షలకు పైనే అవకతవకలు జరిగినట్లు వెల్లడి


అవుకు, మార్చి 6: మండలంలోని గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సామాజిక తనిఖీలపై బహిరంగ సభలో అక్రమాలు వెల్లువెత్తాయి. శనివారం అవుకు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సభకు ఎన్‌ఆర్‌జీఎ్‌స అడిషనల్‌ పీడీ బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ పుల్లారెడ్డి వాటర్‌షెడ్‌ అడిషనల్‌ పీడీ సలీంబాషా, డీవీవో అన్వరాబేగం హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్‌ పీడీ మాట్లాడుతూ 2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు ఉపాధి పథకం ద్వారా 700 పనులు చేపట్టి రూ. 4 కోట్లు ఖర్చు చేశారు. వెలుగు, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌, ఫారెస్టు, పశుసంవర్ధకశాఖలకు ఎన్‌ఆర్‌జీఎ్‌స నుంచి మరికొన్ని నిధులు వెచ్చించి పనులు చేశారు. ఎస్‌ఆర్‌పీ వెంకటే్‌షనాయక్‌ ఆధ్వర్యంలోని డీఆర్‌పీల బృందం గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల్లో రూ. 12,44,357 అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. ఒక ఎన్‌ఆర్‌జీఎ్‌స నుంచి మాత్రమే రూ. 21,344 రికవరీ అయినట్లు తెలిపారు. పనుల్లో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు విధించిన గడువులోపు డబ్బులు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆజాంఖాన్‌, ఈవోఆర్డీ బాలాంజినేయులు, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ఏపీవో హనీఫా, వెలుగు ఏపీఎం జ్యోతి, హౌసింగ్‌ ఏఈ అమీర్‌అలీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కరిముల్లా, పంచాయతీరాజ్‌ ఏఈ గౌస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement