‘ఉజ్వల’లో అక్రమాలు నిగ్గుతేల్చాలి

ABN , First Publish Date - 2022-05-19T06:18:36+05:30 IST

ఉజ్వల ఫౌండేషనలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ అఖిలపక్షం నాయకులు డిమాండు చేశారు.

‘ఉజ్వల’లో అక్రమాలు నిగ్గుతేల్చాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు

అక్రమ లేఔట్లు రద్దుచేయాలి : అఖిలపక్షం నాయకులు 

పుట్టపర్తి, మే 18: ఉజ్వల ఫౌండేషనలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ అఖిలపక్షం నాయకులు డిమాండు చేశారు. స్థానిక సాయిఆరామంలో బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌ అధ్యక్షతన అఖిలపక్షం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమా వేశంలో సీపీఐ, టీడీపీ, జనసేన పార్టీలతో పాటు ప్రజా, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి కేంద్రంలోని ఉజ్వల ఫౌండేషనలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. భూకబ్జాలు పెరిగాయని, సామాన్యప్రజల హక్కులను కాలరాసి ధనిక వర్గాలు సొమ్ము చేసుకుంటున్నాయన్నారు. ఉజ్వల ఫౌండేషనలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు పది కాటేజీల వరకు కొనుగొలు చేసి, పుడా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. కబ్జాల్లో ఏపార్టీ వారున్నా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించా లని డిమాండ్‌ చేశారు. కారు పార్కింగ్‌ స్థలాలను సైతం కబ్జా చేసి అమ్మివేస్తున్నారని, ఉజ్వల ఫౌండేషనకు చెందిన ఓ కాటేజీ యజమాని నమిత పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ వేసిన త్రిసభ్య కమిటీ పారదఽర్శకంగా పనిచేసి బాధితులకు న్యాయం చేయాలని, కాటేజీల దురాక్రమణ అరికట్టాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు కాటమయ్య, జింకా చలపతి, పీసీ గంగన్న, బెస్త చలపతి, తిరుపతేంద్ర అబ్దుల్‌, సామకోటి ఆది, అంజనేయులు మధు, రవినాయక్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:18:36+05:30 IST