అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు

ABN , First Publish Date - 2021-05-09T05:29:32+05:30 IST

ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ స్కీం(ఐసీడీఎస్‌) ఆర్మూర్‌ పరిధిలో అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు


ఇష్టానుసారంగా దరఖాస్తుల స్క ృటిని

తమకు అనుకూలంగా ఉన్న వారి కోసం ధ్రువపత్రాల తారుమారు

క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్లు జారీ చేసిన రెవెన్యూ అధికారులు 


ఆర్మూర్‌, మే8: ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ స్కీం(ఐసీడీఎస్‌) ఆర్మూర్‌ పరిధిలో అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దరఖాస్తుల స్కృటినిలో తమకు అనుకూలమైన వారి కోసం ధ్రువపత్రాలు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో 159 అంగన్‌వాడీ టీచర్స్‌, మినీ టీచర్స్‌, హెల్పర్స్‌ పోస్టుల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. అంగన్‌వాడీ టీచర్‌లకు, హెల్పర్‌లకు మం చి జీతభత్యాలు ఉండడంతో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో పోస్టుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 24అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు 2050, ఐదు మినీటీచర్‌ పోస్టులకు 275, 130హెల్పర్‌ పోస్టులకు 930దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్‌ ఐసీడీఎస్‌ పరిధిలో ఎనిమిది అంగన్‌ వాడీ పోస్టులకు 857దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్కృటినికి సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది కొరత ఉండ డమే గాక దరఖాస్తులు సైతం భారీ సంఖ్యలో రావడంతో స్కృటిని బాధ్యత సీనియర్‌ అంగన్‌వాడీ టీచర్‌లకు అప్ప గించారు. వీరు తమకు అనుకూలమైన వారి కోసం దర ఖాస్తుల్లోని ధ్రువపత్రాలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధ్రువపత్రాలు సరిగ్గా లేకుంటే రిజక్ట్‌ చేయాల్సి ఉండగా వేరే సర్టిఫికెట్లు తీస్తున్నారు. అన్ని సర్టిఫికెట్లు సరిగ్గా ఉండి మెరిట్‌ ఉన్న వారి దరఖాస్తులను పక్కన బెడుతున్నట్టు తెలిసింది. అంబేద్కర్‌చౌరస్తా ప్రాం తానికి చెందిన ఒకరికి టీచర్‌ కాలనీ రెసిడెన్షియల్‌ సర్టిఫి కెట్‌ తీసుకువస్తే అర్హత వస్తుందని సూచించినట్టు తెలిసిం ది. వీరి సూచన మేరకు సదరు అభ్యర్థి టీచర్స్‌కాలనీ సర్టిఫికెట్‌ తీసుకొని సమర్పించినట్టు తెలిసింది. వాస్తవానికి అంబేద్కర్‌ చౌరస్తా ప్రాంతం కమలానెహ్రూ కాలనీలోకి వస్తుంది. చాలా మంది దరఖాస్తుదారులు తమకు నివాస ముండే ప్రాంతం కాకుండా అంగన్‌వాడీ పోస్టు నోటిఫి కేషన్‌ వచ్చిన ప్రాంతానికి రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ తీసుకు న్నారు. రెవెన్యూ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో విచా రణ చేయకుండానే ఇష్టానుసారంగా రెసిడెన్షియల్‌ సర్టిఫి కెట్లు జారీ చేశారు. ఈ విషయమై కొంత మంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నారు. అ భ్యర్థుల ఎంపిక జిల్లాస్థాయి అధికారుల కమిటీ సమక్షంలో జరగనుంది. 10వతరగతి మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరు గుతుంది. స్కృటినిలోనే అవకతవకలు జరుగుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులతో మళ్లీ స్కౄటిని నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-09T05:29:32+05:30 IST