సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలు

ABN , First Publish Date - 2021-04-13T05:35:10+05:30 IST

సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలు
ఒప్పంద పత్రం చూపిస్తున్న బాధితుడు

లబ్ధిదారుల ఆందోళన

ధర్మపురి, ఏప్రిల్‌ 12: సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ధర్మపురి మండలంలోని తుమ్మెనాల అనుబంధ గొల్లపల్లె గ్రామంలో కొందరు లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. జగిత్యాల పశుసంవర్ధ శాఖ ఏడీ శ్రీధర్‌ ఇటీవల లబ్ధిదా రులకు ఫోన్‌ చేసి గొర్రెలు చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు వెళ్లాలని తెలిపారు. దీంతో లబ్ధిదారులు ఈ నెల 8న గురువారం గొల్లపల్లెకు చెందిన ఆరుగురు లబ్ధిదారులు అధికారుల సూచన మేరకు గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని నాగులవరం గ్రామానికి వెళ్లారు. అక్కడకు వెళ్లి మధ్యవర్తిని కలువగా, 21 గొర్రెలకు బదులుగా 10 గొర్రెలు, రెండు పిల్లలు ఇస్తామని చెప్ప డంతో నచ్చక తిరిగి ఇంటికి పయనమయ్యారు. తరువాత మార్గమధ్యన మధ్యవర్తి మరొక సారి ఫోన్‌ చేసి మొత్తం యూనిట్‌ గొర్రెలు ఇస్తామని చెప్పడంతో తిరిగి మధ్యవర్తి వద్దకు వెళ్లి కలిశారు. అక్కడకు వెళ్లిన లబ్ధిదారులకు యూ నిట్‌కు 70 వేల నగదు, 12 గొర్రెలు ఇస్తామని చెప్పారని లబ్ధిదారులు తెలిపారు. గొర్రెల యూనిట్‌ను లబ్ధిదారులకు అధికారికంగా అందజేసిన తరువాత తిరిగి 70 వేలు నగదు తీసుకుని గొర్రెలను మధ్యవర్తులకు అప్పగించేలా, తమతో బలవంతంగా ఒప్పందం చేసుకున్నట్లు బాధితులు పేర్కొ న్నారు. ఈ నెల 11న ఆదివారం గొర్రెల యూనిట్‌ను గొల్లపల్లెకు తీసుక వచ్చిన మధ్యవర్తులు సోమవారం లబ్ధి దారులకు డబ్బులు చెల్లించి గొర్రెలను తిరిగి తీసుక వెళ్లేం దుకు సిద్దం కాగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. దీంతో గొర్రెల విక్రయదారులు, లబ్ధిదారుల మధ్య ఉన్న ఒప్పందం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు పేర్కొం టున్నారు. ఈ విషయమై జగిత్యాల పశు సంవర్ధక శాఖ ఏడీ శ్రీధర్‌ను అడగగా గ్రామంలో సర్పంచ్‌, సొసైటీ అధ్య క్షుల సమక్షంలో ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

Updated Date - 2021-04-13T05:35:10+05:30 IST