‘ పీఏసీఎస్‌లో అక్రమాలపై విచారణ చేపట్టాలి’

ABN , First Publish Date - 2021-02-27T06:09:17+05:30 IST

ఖానాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని పీఏసీఎస్‌ డైరెక్టర్‌లు బిక్కి చిన్నరాజన్న, సుతారి రమేష్‌, గాజుల గంగన్న, దొనికెని గణేష్‌, భుక్యావసంత్‌లు డిమాండ్‌ చేశారు.

‘ పీఏసీఎస్‌లో అక్రమాలపై విచారణ చేపట్టాలి’
కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్న దృశ్యం

ఖానాపూర్‌, ఫిబ్రవరి 26 : ఖానాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని పీఏసీఎస్‌ డైరెక్టర్‌లు బిక్కి చిన్నరాజన్న, సుతారి రమేష్‌, గాజుల గంగన్న, దొనికెని గణేష్‌, భుక్యావసంత్‌లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని పీఏపీఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సీఈవో తెలిపిన వివరాలపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఈవో, చైర్మన్‌ కుమక్కయ్యారని ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపుతూ సొసైటీ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఖానాపూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా గన్ని బ్యాగుల డబ్బులు కాజేశారని ఆరోపించారు. ఒక్క ఖానాపూర్‌ కొనుగోలు కేంద్రానికి సంబందించే రూ, 64 వేలు నష్టం వచ్చినట్లు చూపారని మిగతా వాటిలో ఇంక ఎంత నష్టం వచ్చినట్లు చూపి డబ్బులు కాజేశారో తెలుపాలని తాము ప్రశ్నిస్తే చైర్మన్‌ గాని సీఈవో గాని స్పందించకపోడం సరికాదన్నారు. 

ఉద్ధ్యేశపూర్వకంగానే ఆరోపణలు

తాను అధ్యక్షుడిగా బాద్యతలను స్వీకరించిన నాటి నుండి సంఘాన్ని అభివృద్ది చేస్తుండడంతో ఓర్వలేకనే రాజకీయ దురుద్దేశ్యంతో ఉద్ద్యేశపూర్వకంగా పలువురు డైరెక్టర్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖానాపూర్‌ పీఏసిఎస్‌ చైర్మన్‌ ఇప్ప సత్యనారాయణరెడ్డి అన్నారు. ఖానాపూర్‌ పీఏసిఎస్‌ 2016 నుండి సివిల్‌ సప్లై శాఖకు రుణపడి ఉన్న గన్నీ బ్యాగులను ఈ సారి జిల్లా అధికారుల సూచనతో తాము కొనుగోలు చేశామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-27T06:09:17+05:30 IST